Telangana Jobs: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. మార్గదర్శకాల విడుదల
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఆయా కాలేజీల్లో ఖాళీలను దృష్టిలో ఉంచుకొని 1652 గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నియామకులకు సంబంధించి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలన్న దానిపై జిల్లా ఇంటర్ విద్య...
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఆయా కాలేజీల్లో ఖాళీలను దృష్టిలో ఉంచుకొని 1652 గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నియామకులకు సంబంధించి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలన్న దానిపై జిల్లా ఇంటర్ విద్య అధికారులకు మార్గదర్శకాలను సూచించింది. ఈ నియామకాలకు ఆయా జిల్లా పరిధిలో సెలక్షన్ కమిటీలను నియమించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్, కాలేజీ ప్రిన్సిపల్ మెంబర్లుగా కమిటీ ఉంది. ఈ ముగ్గురు గెస్ట్ ఫ్యాకల్టీని ఎంపిక చేస్తారు.
ఫ్యాకల్టీ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కావాల్సిన సబ్జెక్టులకు ఫ్యాకల్టీని ఎంతమంది అవసరమో ఎన్ని గెస్ట్ ఫ్యాకల్టీలు రిక్రూట్మెంట్ చేసుకోవాలో నిర్ణయిస్తారు. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి జిల్లా ఇంటర్ విద్య అధికారులు ప్రకటన త్వరలో జారీ చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా ఇంటర్ విద్య అధికారుల కార్యాలయాల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో పీజీ మార్కుల ఆధారంగా 1:3 పద్ధతిలో జిల్లా ఇంటర్ విద్య అధికారి ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీకి మెరిట్ లిస్టును పంపిస్తారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ గెస్ట్ ఫ్యాకల్టీనీ ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ ప్రూఫ్స్ సర్టిఫికెట్స్‌తో పాటు మూడు సెట్ల ఫోటో కాపీలతో రావాల్సి ఉంటుంది. గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందికి ఈ అకాడమీక్ ఇయర్ ముగిసే వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. వీరికి రెగ్యులరైజ్ గాని రెన్యువల్ కానీ చేయాలని కోరే వీలు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్ ఏవి గెస్ట్ ఫ్యాకల్టీకి వర్తించవు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..