AP DME Recruitment 2023: ఎలాంటి రాత పరీక్షలేకుండా ప్రభుత్వ కొలువు.. ఏపీలో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో..
ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ అంటే డీఎం/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ డీఎంఏలో ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో జులై 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పెషాలిటీలు..
ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ, మెడిసిన్ జనరల్ సర్జరీ, సిటి సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీసీ, ఆర్థోపెడిక్స్, మెడికల్ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ తదితర స్పెషలైజేషన్‌లో ఖాళీలున్నాయి.
దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీకి చెందిన వారు రూ.1000, బీఈ/ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్ధులు రూ.500 అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధానంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.