అస్తవ్యస్త జీవనశైలి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు, సిగరెట్‌ల వినియోగం ఇందుకు ప్రధాన కారణం. ధూమపానానికి దూరంగా ఉండటం, ఆహారంలో ఉప్పు తగ్గించి తినడం, పండ్లు కూరగాయలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని అనేక అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది.