AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మేడారం మహాజాతర సరికొత్త రికార్డ్.. జనం నుండి వనంలోకి సమ్మక్క..

తెలంగాణలో మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్న పూజారులు. గద్దెల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మ‎ను సాగనంపనున్నారు. దీంతో వనప్రవేశంకు మూడంచెల రోప్ పార్టీతో పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు పోలీసుల అధికారులు.

Telangana: మేడారం మహాజాతర సరికొత్త రికార్డ్.. జనం నుండి వనంలోకి సమ్మక్క..
Medaram Jatara
Srikar T
|

Updated on: Feb 24, 2024 | 7:04 PM

Share

తెలంగాణలో మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్న పూజారులు. గద్దెల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మ‎ను సాగనంపనున్నారు. దీంతో వనప్రవేశంకు మూడంచెల రోప్ పార్టీతో పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు పోలీసుల అధికారులు. డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సాంప్రదాయాలతో వన ప్రవేశం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో మేడారం జాతర చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొంది. జాతరకు ముందు నెల రోజుల వ్యవధిలో 55 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు అధికారులు.నాలుగు రోజుల జాతరలో 1కోటి 30 లక్షల మంది భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారని అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. శని, ఆదివారాలు కలిపి మరో 10 లక్షల మంది దర్శించుకుంటారని భావిస్తోంది అధికార యంత్రాంగం.

జాతర సక్సెస్‎కు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు జిల్లా మంత్రి సీతక్క. నాలుగు రోజుల జాతరలో సమ్మక్క సారక్క దేవతలకు పలువురు ప్రముఖులు మొక్కులు తీర్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిలి సై సౌందర్ రాజన్, స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండాతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, విప్ రాంచంద్రనాయక్ ఆమ్మవారిని దర్శించుకున్నారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా..ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ర్ట, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వనదేవతలను దర్శించుకున్నారు. జాతరలో దోపిడీ దొంగలను పసిగట్టేందుకు ఏర్పాటు చేసిన బారి కమాండ్ కంట్రోల్ రూమ్ సత్ఫలితాలనిచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో ఈసారి భక్తులు సంఖ్య భారీగా పెరిగింది. 6 వేల బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారికంగా పేర్కొంది.జాతరలో తప్పిపోయిన 1280 మందిని బంధువుల చెంతకు చేర్చినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..