Hyderabad: పేరు బ్రాండే.. లోపలంతా కల్తీ.. మిమ్మల్ని షేక్ చేసే న్యూస్

బ్రాండ్‌ను చూసి సరుకులు కొనేవాళ్లు ఎందరో ఉంటారు. ఆ బ్రాండ్‌ తప్ప మరే బ్రాండ్‌ వాడనే వాడమనే వాళ్లూ ఉంటారు. మీరూ కూడా అంతేనా! ఐతే జర గుండె దిటువు చేసుకోండి. బ్రాండ్‌ బాజా చేసే షాకింగ్‌ నిజాల్ని కళ్ల ముందుకు తీసుకువచ్చారు హైదరాబాద్‌ పోలీసులు.

Hyderabad: పేరు బ్రాండే.. లోపలంతా కల్తీ.. మిమ్మల్ని షేక్ చేసే న్యూస్
Adulterated Products
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 26, 2024 | 9:31 AM

కొబ్బరి నూనె…  టీ పౌడర్‌…  సర్ఫ్‌…. ఫ్లోర్‌ క్లీనర్స్‌…. ఇలాంటివి అన్నీ బ్రాండెడ్ తెచ్చుకుంటున్నాం మనకేం కాదు అనుకుంటున్నారు కదూ.. ఆగండాగండి..  సెంట్రల్‌ జోన్‌ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. కలర్‌ ఫుల్‌గా కన్పిస్తోన్న ఈ సీన్‌ వెనుక ఖతర్నాక్‌ స్కెచ్‌ వుంది.  కలర్‌, ప్యాకింగ్‌ అంతా ఒరిజినల్‌లా ఉంటాయి. కానీ ఇవి ఒరిజినల్‌ కాదు. పక్కా కల్తీ  ప్రొడక్ట్స్‌  మేడిన్‌  మైలార్‌దేవ్‌ పల్లి.

అగ్గి పుల్ల.. సుబ్బ బిళ్ల కాదేది  కల్తీకి అనర్హం అన్నట్టుగా  టీ పౌడర్‌, కొబ్బరి నూనె, మసాలాలు, సర్ఫ్‌  ఇలా  నిత్యావసర సరుకుల కల్తీ దందా చేస్తోన్న మహేంద్ర సింగ్‌ గ్యాంగ్‌కు చెక్‌ పెట్టారు  హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ పోలీసులు. కాచిగూడలో కూపీలాగితే కాటేదాన్‌లో నకిలీల డొంక కదిలింది. ఎవరెస్ట్ మసాలా, పారాచూట్ కొబ్బరినూనె, ప్రముఖ టీ ఫౌడర్స్.. ఇలా అన్ని కల్తీ చేశారు కేటుగాళ్లు. మరి ఒరిజనల్‌కు నకిలీకి డిఫెరెన్స్‌ ఎట్టా పసిగట్టేది. సబ్బు, సర్ఫ్‌ ప్యాకెట్స్ కూడా మేడి పండు సామెతే. అంతేనా.. హార్పిక్, లైజోన్, సర్ఫ్ ఎక్సెల్ వంటి బాత్ రూం క్లీనింగ్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు.  నగరంలోని బస్తీల్లో వీటిని విక్రయిస్తున్నారు.

మైలార్‌దేవ్‌, కాటేదాన్‌  పారిశ్రామిక వాడల్లో గుట్టుచప్పుడు కాకుండా  సాగుతోన్న  కల్తీ దందాకు చెక్‌ పెట్టారు సెంట్రల్‌ జోన్‌ పోలీసులు. కల్తీ సరుకుతో పాటు మిషనరీ ఆల్‌ టుగెదర్‌  2 కోట్ల ప్రాపర్టీని  సీజ్‌ చేశారు. ఈ ముఠాలో ముగ్గురు అరెస్ట్ అవ్వగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు అని చెబుతున్నారు పోలీసులు. తక్కువ ధర అంటూ హైదరాబాద్లోని కిరాణా షాపులకు విక్రయిస్తున్నారని.. తక్కువ రేటుకు బ్రాండెడ్ ప్రాడెక్ట్స్ వస్తున్నాయనే ఆశతో జనం వీటిని కొనుగోలు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇలాంటి కల్తీ ప్రొడక్ట్స్‌ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. అదీ సంగతి.  రాజధానిలో  నకిలీ దందా ఎలా రంకెలేస్తుందో చూశారుగా.  ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదని ఊసరుమంటే సరిపోదు.   ఖరీదు చేసేప్పుడు ఒరిజనలా? కల్తీనా? అని  ఒక్కసారి జాగ్రత్తా పరీక్షించండి. తేడాను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…