AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITI Summit: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఎంఐఎం.. అసలు ఫ్లాన్ ఏంటో అసదుద్దీన్ మాటల్లో..

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా 'వాట్ ఇండియా టుడే థింక్' మూడో రోజు ఫిబ్రవరి 27న నిర్వహించే 'సత్తా సమ్మేళనం'లో పాల్గొనబోతున్నారు. TV 9 ఈ వేదిక ద్వారా ఒవైసీ తన బాణీని వినిపించబోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తన పార్టీ సన్నాహాలను వివరించబోతున్నారు.

TV9 WITI Summit: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఎంఐఎం.. అసలు ఫ్లాన్ ఏంటో అసదుద్దీన్ మాటల్లో..
Asaduddin Owaisi
Balaraju Goud
|

Updated on: Feb 24, 2024 | 6:15 PM

Share

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ వంటి అతిపెద్ద ఈవెంట్‌తో మళ్లీ సిద్ధంగా ఉంది. రాజకీయ, క్రీడా, సినీ, ఆర్థిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేదికను పంచుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ‘వాట్ ఇండియా టుడే థింక్’ మూడో రోజు ఫిబ్రవరి 27న నిర్వహించే ‘సత్తా సమ్మేళనం’లో పాల్గొనబోతున్నారు. TV 9 ఈ వేదిక ద్వారా ఒవైసీ తన బాణీని వినిపించబోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తన పార్టీ సన్నాహాలను వివరించబోతున్నారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా టీవీ9 ‘సత్తా సమ్మేళనం’ వేదికపై తీవ్ర చర్చ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, పంజాబ్ సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటుండగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నారు. తన సాహసోపేతమైన శైలికి మారుపేరు అయిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశంలోని ముస్లిం సమాజ ప్రజల హక్కుల గురించి మాట్లాడుతుంటారు. ఆల్ ఇండియా ‘భాయిజాన్’ అనే ఈ సెషన్‌లో, అసదుద్దీన్ ఒవైసీ దేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తన పార్టీ సన్నద్ధత గురించి కొంత సమాచారం ఇవ్వనున్నారు. ఇటీవలె తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల్లో ఏఐఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉంటారని అసద్ ప్రకటించారు. అలాగే, కేంద్రంలోని గత 10 ఏళ్ల ఎన్డీయే ప్రభుత్వ విధానాలు, కార్యకలాపాలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు.

మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో హిందూ-ముస్లింల పేరుతో జరిగే ఎన్నికలకు సంబంధించి ఒవైసీ తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC), ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు సంబంధించిన సమస్యలను బీజేపీ నిరంతరం లేవనెత్తుతోంది. TV9 వేదికగా ఒవైసీ ఈ అంశంపై తన అభిప్రాయాలను తెలియజేయాలని భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ యూసీసీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అసోంలోని బీజేపీ ప్రభుత్వం కూడా యూసీసీ అమలుపై నోరు పారేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో ఈ అంశంపై ఒవైసీ తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు.

TV9 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రస్తుతం భారతదేశం ఏమనుకుంటుందో’ అనే కార్యక్రమం మూడో రోజు ‘సత్తా సమ్మేళనం’లో రసవత్తర రాజకీయ చర్చ జరగనుంది. విశేషమేమిటంటే ‘సత్తా సమ్మేళనం’లో భారతీయ జనతా పార్టీ నేతలు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు వేర్వేరు సమావేశాలకు హాజరుకానున్నారు. జెపీ నడ్డా, మల్లికార్జున్ ఖర్గే ఎన్నికలకు తమ పార్టీ సన్నాహాలు గురించి చెప్పబోతున్నారు. రెండు పార్టీలు ఏ ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేస్తుందో కూడా సూచన ఇవ్వనున్నారు. వీరితో పాటు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వేదికపైకి వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.

ఈ ‘సత్తా సమ్మేళనం’ వేదికపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ హాజరుకానున్నారు. వీరితో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా TV9 ‘సత్తా సమ్మేళనం’ వేదికపైకి రానున్నారు. ఈ అద్భుతమైన మూడు రోజుల కార్యక్రమం అమిత్ షా ప్రసంగంతో ముగుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…