AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-China: భారత్‌-చైనా మధ్య అత్యున్నత స్థాయి సైనిక చర్చలు.. రాని స్పష్టమైన ముగింపు.

India-China: భారత్‌-చైనా మధ్య అత్యున్నత స్థాయి సైనిక చర్చలు.. రాని స్పష్టమైన ముగింపు.

Anil kumar poka
|

Updated on: Feb 24, 2024 | 6:20 PM

Share

భారత్‌-చైనా మధ్య 21వ కార్ఫ్స్‌ కమాండర్‌స్థాయి చర్చలు ఈ నెల 13న చుషుల్‌-మోల్డో బోర్డర్‌లో మీటింగ్ పాయింట్‌లో జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్‌, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది.

భారత్‌-చైనా మధ్య 21వ కార్ఫ్స్‌ కమాండర్‌స్థాయి చర్చలు ఈ నెల 13న చుషుల్‌-మోల్డో బోర్డర్‌లో మీటింగ్ పాయింట్‌లో జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్‌, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, చర్చల్లో మూడేన్నరేళ్లుగా కొనసాగుతున్న వివాద పరిష్కారంపై స్పష్టమైన ముగింపును కనుగొనలేకపోయారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలను ఉపసంహరించుకోవడంపై గత పర్యటనల్లో జరిగిన చర్చలు భారత్-చైనా మధ్య సరిహద్దులో శాంతికి ముఖ్యమైన ప్రాతిపదిక అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చర్చల సందర్భంగా ఇరుదేశాలు తమ అభిప్రాయాలను పరస్పరం స్నేహపూర్వకంగా ముందుంచాయని తెలిపింది. మధ్యంతర కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..