AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: టీవీ9 గ్లోబల్ సమ్మిట్‎లో భారత ఆర్ధిక వ్యవస్థపై విశ్లేషించనున్న ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక వేత్తలు..

ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు ఏమిటి? అభివృద్ధి ప్రణాళికలు ఏమిటి? టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది.

WITT: టీవీ9 గ్లోబల్ సమ్మిట్‎లో భారత ఆర్ధిక వ్యవస్థపై విశ్లేషించనున్న ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక వేత్తలు..
Amul Md And Bharatpay Chairman
Srikar T
|

Updated on: Feb 24, 2024 | 5:57 PM

Share

ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు ఏమిటి? అభివృద్ధి ప్రణాళికలు ఏమిటి? టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఫోరమ్‌కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే అమూల్ ఎండీ జాయెన్ మెహతాతో పాటు ఎస్‎బీఐ (SBI) మాజీ చైర్మన్, భారత్ పే (Bharat pay) ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్ ఆర్థిక విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ప్రపంచంలోని ఇతర దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. కానీ భారతదేశం మాత్రమే ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశం సాధించిన ఈ విజయం వెనుక డిజిటల్ ఫైనాన్స్, ఫిన్‌టెక్ సంస్థ కీలక పాత్ర పోషించింది.

ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రాధాన్యతనిచ్చింది. దీనికి తోడు సహకార రంగంలోని అమూల్ వంటి సంస్థలు ఆర్థిక వ్యవస్థను పెంచడమే కాకుండా కోట్లాది మందికి ఉపాధిని కల్పించాయి. అటువంటి పరిస్థితిలో, ఈ రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు భారతదేశ భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు? అనే ఈ ప్రశ్నకు సమాధానాలు భారతదేశంలోని నంబర్-1 న్యూస్ నెట్‎వర్క్ సంస్థ టీవీ9 అందిస్తోంది. ఈ కార్యక్రమంలో అమూల్ ఎండీ జయేన్ మెహతా, ఎస్‌బీఐ మాజీ చైర్మన్, భారత్‌పే ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్ పాల్గొంటారు. వాట్ ఇండియా టుడే థింక్స్ కార్యక్రమం ద్వారా ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తారు. ఈ ఫోరమ్‌లో మోదీ సహా పలువురు నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సినీ రంగానికి చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలు, క్రీడా నిపుణులు, వ్యాపారవేత్తలతో చర్చించనున్నారు. ప్రధానంగా ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు, సీఏలు, సీఈవోలు, కంపెనీల ప్రెసిడెంట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అమూల్ ఎండీ జయన్ మెహతా..

అమూల్ బ్రాండ్ విలువ రూ.61 వేల కోట్లకు పైగా ఉంది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ యాజమాన్యంలో ఉంది. జయన్ మెహతా కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పాల ఉత్పత్తుల తయారీ, విక్రయం కంపెనీ ప్రధాన వ్యాపారంగా మారింది. జయన్ మెహతా తొలిసారిగా 1991లో అమూల్‌తో చేతులు కలిపారు. అతను ఇక్కడ బ్రాండ్ మేనేజర్‌గా, గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్‌గా, జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఏప్రిల్-సెప్టెంబర్ 2018 నుండి అమూల్ డెయిరీకి ఎండిగా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

రజనీష్ కుమార్, చైర్మన్, భారత్ పే

ఒకప్పుడు దేశంలో ఐదవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యస్ బ్యాంక్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో దాన్ని పునరుద్ధరించే బాధ్యతను ఎస్‌బీఐకి చెందిన రజనీష్‌కుమార్‌కు అప్పగించారు. దానికి తగ్గట్టుగానే మంచి వృద్ధిని సాధించింది. ఈయన ఎస్‌బీఐ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం భారత్ పే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. రజనీష్ కుమార్‌కు బ్యాంకింగ్ రంగంలో 40 ఏళ్ల అనుభవం ఉంది. క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, ఫారిన్ ఎక్స్ఛేంజ్, రిటైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమస్యలను హ్యాండిల్ చేసిన అనుభవం ఆయనకు ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..