Hyderabad: ప్రేమ కలిపింది.. పాల వ్యాను ప్రాణం తీసింది.! ఘోర రోడ్డు ప్రమాదం.
కులాలు వారి ప్రేమకు అడ్డురాలేదు.. పెద్దలు పెద్దమనసుతో వారి ప్రేమను అంగీకరించారు. మూడు నెలల్లో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్రేమ జంట సంతోషంగా బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లింది. తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదం రూపంలో వరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. వధువు తీవ్ర గాయాలతో చావునుంచి తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కులాలు వారి ప్రేమకు అడ్డురాలేదు.. పెద్దలు పెద్దమనసుతో వారి ప్రేమను అంగీకరించారు. మూడు నెలల్లో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్రేమ జంట సంతోషంగా బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లింది. తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదం రూపంలో వరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. వధువు తీవ్ర గాయాలతో చావునుంచి తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శామీర్‌పేట ఎస్సై మునీందర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. కంటోన్మెంట్, ఈస్టు మారేడ్‌పల్లికి చెందిన జగలింగప్ప అలియాస్ విక్కీ బీకాం చదువుతూనే కుటుంబ పోషణకోసం వైఫై కనెక్షన్లు అమర్చే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కంటోన్మెంట్‌లోని పికెట్ కాలనీకి చెందిన శేషగిరి వైష్ణవి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరైనా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకున్నారు. మరో మూడు నెలల్లో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు ప్రేమికులు ద్విచక్రవాహనంపై సిద్ధిపేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శామీర్‌పేటలోని రాజీవ్ రహదారి మీదుగా వస్తుండగా.. ఆరెంజ్‌బోల్-దర్గా చౌరస్తా వద్దకు రాగానే వెనకనుంచి వచ్చిన ఓ పాల ట్యాంకర్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దాంతో విక్కీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొద్ది దూరం వెళ్లాక వ్యాన్ డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్టు గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..