Guntur: అర్ధరాత్రి నడివీధిలో ఎగసిపడిన మంటలు..అసలేం జరిగింది.? వీడియో.
వేసవి ప్రారంభమైంది. సూర్యుడితోపాటు అగ్నిదేవుడు కూడా తన ప్రతాపాన్ని చూపించేదుకు రెడీ అయిపోయాడు. పలు చోట్ల వివిధ కారణాలతో అగ్నిప్రమాదాలు చోటచేసుకుంటున్నాయి. సాధారణంగా ఎండలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం మనం చూసాం. కానీ అర్ధరాత్రి చల్లని వెన్నెల వేళ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
వేసవి ప్రారంభమైంది. సూర్యుడితోపాటు అగ్నిదేవుడు కూడా తన ప్రతాపాన్ని చూపించేదుకు రెడీ అయిపోయాడు. పలు చోట్ల వివిధ కారణాలతో అగ్నిప్రమాదాలు చోటచేసుకుంటున్నాయి. సాధారణంగా ఎండలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం మనం చూసాం. కానీ అర్ధరాత్రి చల్లని వెన్నెల వేళ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. శబ్ధాలకు బయటకు వచ్చిన స్థానికులు మంటలు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పొన్నూరులో అత్యంతరద్దీగా ఉండే ప్రాంతం తోట్లమ్మ గుడి సెంటర్ . ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా వెళతాయి. రాత్రి వేళ జనసంచారం పెద్దగా లేని సమయంలో గుడి ప్రక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్క సారిగా అగ్ని కీలలు ఎగసి పడటంతో అడపాదడపా అటుగా వెళ్తున్న వాహన దారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్థరాత్రి కావడంతో వాహనాల రద్దీ లేకపోవడం, అక్కడ ఉన్న వ్యాపార సముదాయాలు మూసి వేసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి ,ఫోన్ చేసారు. హుటాహుటిన అక్కడి వచ్చి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానికులు, కరెంట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..