Telangana: మిర్చి తోటల్లో కూలీలతో హల్ చల్ చేసిన ముగ్గురు మంత్రులు.. బాగోగులపై ఆరా!

నిత్యం సభలు, సమావేశాలు, సమీక్షలతోపాటు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలతో వారు నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నా.. సమయం దొరికితే చాలు ప్రజలతో మమేకం అవుతారు. ఒకరు ధోవతి, మరోకరు తలపాగా, ఇంకొకరు సూటు బూటుతో కలిసిన ముగ్గురు మంత్రులు ఒకటయ్యారు. ఏకంగా ముగ్గురు మంత్రులు కలిసి మిర్చి తోటల్లో కూలీలతో హల్ చల్ చేశారు.

Telangana: మిర్చి తోటల్లో కూలీలతో హల్ చల్ చేసిన ముగ్గురు మంత్రులు.. బాగోగులపై ఆరా!
Ministers Uttam, Bhatti, Komatireddy
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Feb 24, 2024 | 5:29 PM

నిత్యం సభలు, సమావేశాలు, సమీక్షలతోపాటు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలతో వారు నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నా.. సమయం దొరికితే చాలు ప్రజలతో మమేకం అవుతారు. ఒకరు ధోవతి, మరోకరు తలపాగా, ఇంకొకరు సూటు బూటుతో కలిసిన ముగ్గురు మంత్రులు ఒకటయ్యారు. ఏకంగా ముగ్గురు మంత్రులు కలిసి మిర్చి తోటల్లో కూలీలతో హల్ చల్ చేశారు. వారెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చింతలపాలెం మండలం కృష్ణాపురం మీదుగా మంత్రుల కాన్వాయ్ వస్తోంది. పక్కనే ఉన్న మిర్చి తోటల్లో కూలీలు పని చేస్తున్నారు. మండుటెండల్లో పనిచేస్తున్న కూలీలపై మంత్రుల కన్ను పడింది. వెంటనే కాన్వాయ్‌ని ఆపించిన మంత్రులు.. కూలీల వద్దకు వెళ్లారు. మిర్చి తోటల్లో తిరుగుతూ మిర్చి పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముగ్గురు మంత్రులు.

అనంతరం మిర్చి తోటల్లో పనిచేస్తున్న కూలీలతో ముగ్గురు మంత్రులు పొలం గట్టుపై కూర్చుని ముచ్చటించారు. రోజువారీ కూలీ ఎంత వస్తుంది..? ఇక్కడ కూర్చున్న మంత్రులు తెలుసా అంటూ కూలీలను ప్రశ్నించారు. రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయంటూ అడిగి తెలుసుకున్నారు మంత్రులు. జనం కష్టసుఖాల్లో కాంగ్రెస్ సర్కార్ తోడుంటుందని భరోసా ఇచ్చారు ముగ్గురు మంత్రులు. కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న గ్యారెంటీల గురించి వారికి వివరించారు. ఈ క్రమంలోనే ఇకపై ఒకటో తేదీ నుంచి మీరు ఇంటికి కరెంటు బిల్లు కట్టవద్దని మంత్రులు సూచించారు. ఆరు గ్యారెంటిలను అన్నింటినీ అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. ఊహించని పరిణామంతో షాక్ అయ్యిన రైతులు కూలీలు.. మంత్రులు సరదాగా ముచ్చటించడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…