Medak Politics: రెండు ప్రధాన పార్టీలను తెగ కలవర పెడుతున్న ఆ ఒక్క సీటు..!
ఆ ఒక్క సీటు రెండు ప్రధాన పార్టీలను తెగ కలవర పెడుతుందట. ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థులను ప్రకటించడానికి రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయట. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాళ్లుగా మరీనా ఆ పార్లమెంట్ స్థానం ఎక్కడ..?

ఆ ఒక్క సీటు రెండు ప్రధాన పార్టీలను తెగ కలవర పెడుతుందట. ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థులను ప్రకటించడానికి రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయట. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాళ్లుగా మరీనా ఆ పార్లమెంట్ స్థానం ఎక్కడ..?
మెదక్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించడం సవాలుగా మారిందట బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు. ఆ పార్టీల నుండి ఇక్కడ అభ్యర్థి పెట్టడానికి తర్జనభర్జన అవుతున్నాయట. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ రెండు పార్టీలకు మంచి పట్టు ఉన్న కూడా, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవి ఏమి పనిచేయడం లేదట. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయట. దీనికి కారణం ఇక్కడ ఎలాగైనా గెలవాలనే గట్టిగా భావిస్తున్నాయట రెండు పార్టీలు. అందుకే ఈ సీటును చాలా సీరియస్‌గా తీసుకున్నాయట. ముందు ఒక పార్టీ ప్రకటిస్తే, ఆ అభ్యర్థిని చూసి ఇంకో పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని వేచి చూస్తుందట..!
నలబై ఏళ్ల కిందట దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోందట. గతంలో కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 1979-84 మధ్యకాలంలో దివంగత నేత ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి దేశ ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత మాజీ మంత్రి ఎం.బాగారెడ్డి రెండు దశాబ్దాలు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం మొదలవడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే.. ఉద్యమం నుండి ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీకి వరుస విజయాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఆ ఎన్నికలలో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి, దివంగత ఎంపీ ఆలె నరేంద్ర గెలుపొందారు. ఆ తర్వాత పొత్తు లేకపోయినా 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ వరుసగా విజయం సాధించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన అనంతరం పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నిక సవాల్‌గా నిలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. అందుకే మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం తర్జనభర్జన పడుతున్నదట ఆ పార్టీ.
గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మెదక్ పార్లమెంట్ ను, తెలంగాణ ఉద్యమం ఫలితంగా బీఆర్‌ఎస్ కి పెట్టని కోటగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంతేకాక ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఉన్నారు. వీరిని ఎదుర్కొని ఈ నియోజక వర్గంలో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తో్ంది.
ఇక, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బలమైన నేతను పెట్టాలనే ఆలోచనలో ఉందట.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టు ఉందని, దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోవాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తేలిపోయింది. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉందని, దాన్ని పోగొట్టుకోకుండా ఈ పార్లమెంట్ పరిధిలో మళ్ళీ విజయం సాధించాలని బీఆర్ఎస్ వ్యూహలు రచిస్తుందట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




