Revanth Reddy: ప్రజా పాలనకు వంద రోజులు.. సీఎం రేవంత్ కు అదిరిపొయే గిఫ్ట్.!
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో జయకేతనం ఎగురవేసింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రేవంత్ పాలనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 శుక్రవారం నాటికి కాంగ్రెస్ ప్రజా పాలన విజయవంతంగా 100 రోజులు పూర్తిచేసుకుంది.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో జయకేతనం ఎగురవేసింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రేవంత్ పాలనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 శుక్రవారం నాటికి కాంగ్రెస్ ప్రజా పాలన విజయవంతంగా 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు అరవింద్ విస్తరాకుపై సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. అరుదైన కళాఖండంతో రేవంత్ సర్కార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అరవింద్ తన కళా నైపుణ్యంతో ఇలాంటి ఒక ఆర్ట్ వేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కళాకారుడి ప్రతిభకు ప్రశంసలు కురిపిస్తున్నారు. అరుదైన కళను పరిచయం చేసారంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.