Viral: వీళ్లు మామూలోళ్లుకాదు.. ఏకంగా చెట్టుపైనే సిట్టింగ్‌ వేసేసారుగా.!

Viral: వీళ్లు మామూలోళ్లుకాదు.. ఏకంగా చెట్టుపైనే సిట్టింగ్‌ వేసేసారుగా.!

Anil kumar poka

|

Updated on: Mar 17, 2024 | 3:21 PM

సరదాగా ఫ్రెండ్‌ వీకెండ్‌లో ఎంజాయ్‌ చేద్దామనుకున్నవారు ఏ కల్లు కాంపౌండ్‌లోనో, బార్‌లోనో, లేదంటే ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్‌ చేస్తారు. కానీ ఈ యువకులు భూమికి, ఆకాశానికి మధ్యలో సిట్టింగ్‌ వేసారు. ఇదేంటి.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ సందేహం రావడం సహజమే. ఈ మందుబాబులు ఏకంగా తాటిచెట్టుపైనే మకాం పెట్టేసారు. చెట్టుపైన కూర్చుని హ్యాపీగా కల్లు తాగేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నారు.

సరదాగా ఫ్రెండ్‌ వీకెండ్‌లో ఎంజాయ్‌ చేద్దామనుకున్నవారు ఏ కల్లు కాంపౌండ్‌లోనో, బార్‌లోనో, లేదంటే ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్‌ చేస్తారు. కానీ ఈ యువకులు భూమికి, ఆకాశానికి మధ్యలో సిట్టింగ్‌ వేసారు. ఇదేంటి… అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ సందేహం రావడం సహజమే. ఈ మందుబాబులు ఏకంగా తాటిచెట్టుపైనే మకాం పెట్టేసారు. చెట్టుపైన కూర్చుని హ్యాపీగా కల్లు తాగేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎంచక్కా చెట్టెక్కి కూర్చుని వెదరు బొంగులతో కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకృతి అందాలతో అలరారే భద్రాచలం మన్యంలో గిరిజనుల జీవన విధానం భిన్నంగా ఉంటుంది. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు ఆదివాసీలు. వారి జీవన విధానంలో సురాపానం సేవించడం కూడా ఒక భాగమే. వేసవిలో పగలంతా కష్టపడి సాయత్రం వేళ తాటి చెట్టు కల్లు తాగడం ఇక్కడ సర్వ సాధారణం. ఈ క్రమంలో గిరిజన యువకులు కొందరు వినూత్నంగా ప్రయత్నించారు. తాటి చెట్టుకింద కాకుండా చెట్టుపైన కూర్చుని కల్లు తాగాలని భావించారు. అంతే వెంటనే తమ ఆలోచనను అమలు చేశారు. సుమారు 30 అడుగులు ఉండే వెదురు బొంగులతో పటిష్ఠమైన నిచ్చెన ఏర్పాటు చేసుకున్నారు. తాటి చెట్టు చుట్టూ వెదురు బొంగులతో ఒక మంచెను ఏర్పాటు చేసారు.

ఎంచక్కా చెట్టెక్కి మంచెపై కూర్చుని అప్పటికప్పడు తాటి కల్లును నేరుగా చెట్టునుంచి స్వహస్తాలతో తీసుకుని సేవిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ భూమికి 30 అడుగుల ఎత్తున ఉండి సురాపానం సేవించడాన్ని ఆ ఊరి వాళ్లంతా ఇప్పుడు పాటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మద్యం మత్తులో అంత ఎత్తునుంచి కిందపడితే ప్రాణాలకు ప్రమాదమని, ఇలాంటివి మంచిదికాదని సూచిస్తున్నారు. కొందరు మాత్రం యువకుల ఐడియాను మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..