Rickshaw Wala: బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటున్న రిక్షా కార్మికులు.!
జుగాడ్‌లు చేయడంలో భారతీయులను మించినవారు లేరని చెప్పవచ్చు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. ట్యాలెంట్ ఏ ఒక్కరి సొంతమో కాదనిపిస్తోంది. అందులో కొందరు రిక్షా కార్మికులు చేసిన జుగాఢ్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇందులో కొన్ని రిక్షాలు ఒక దానికి ఒకటి జత చేసిన తీరు అద్భుతంగా అనిపిస్తోంది.
జుగాడ్‌లు చేయడంలో భారతీయులను మించినవారు లేరని చెప్పవచ్చు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. ట్యాలెంట్ ఏ ఒక్కరి సొంతమో కాదనిపిస్తోంది. అందులో కొందరు రిక్షా కార్మికులు చేసిన జుగాఢ్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇందులో కొన్ని రిక్షాలు ఒక దానికి ఒకటి జత చేసిన తీరు అద్భుతంగా అనిపిస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు కలిసి రోడ్డుపై అనేక రిక్షాలను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, ఒక రిక్షా ముందుకు కదులుతోంది, దాని వెనుక మరొక రిక్షా ముందు చక్రం మొదటి రిక్షాకు కట్టారు. అదేవిధంగా అనేక రిక్షాలు ఒకదానికొకటి ఎటాచ్ చేశౄరు. ప్రతి రిక్షా మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అందరూ రిక్షా తొక్కుతున్నారు. ఒకదానికొకటి కనెక్ట్ చేసిన ఈ రిక్షాలు రైలు కంపార్ట్‌మెంట్ లాగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోను రెండున్నర లక్షలమందికిపైగా లైక్ చేశారు. ఈ బండికి బ్రేకులు ఎలా వేస్తారంటూ కొందరు… రైలు చిన్నదిగా ఉందని ఇంకొందరు కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సెల్ఫ్ డ్రైవింగ్ కోచ్‌లను ప్రారంభించింది అంటూ మరొకరు చమత్కరించారు. ఇది స్మార్ట్ బంగ్లాదేశ్ అంటూ ఇంకొకరు అభిప్రాయపడ్డారు. జుగాడ్‌లో భారతీయులను మించిపోయారు బంగ్లాదేశీయులు అంటూ రకరకాల కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.