Live from Jail: స్వర్గంలో ఉన్నా.! జైలు నుంచి ఖైదీ వీడియో లైవ్‌ స్ట్రీమింగ్‌..

Live from Jail: స్వర్గంలో ఉన్నా.! జైలు నుంచి ఖైదీ వీడియో లైవ్‌ స్ట్రీమింగ్‌..

Anil kumar poka

|

Updated on: Mar 18, 2024 | 1:51 PM

ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్‌ చేసిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్‌ జైలు నుంచి ఈ వీడియో ప్రసారమైనట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ స్ట్రీమింగ్ చేసినట్లు తెలిపారు. రెండు నిమిషాల వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్‌ చేసిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్‌ జైలు నుంచి ఈ వీడియో ప్రసారమైనట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ స్ట్రీమింగ్ చేసినట్లు తెలిపారు. రెండు నిమిషాల వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ వ్యాఖ్యానించాడు. 2019లో రాకేష్ యాదవ్‌ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్‌ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్‌ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో రాకేష్‌ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై యూపీ జైళ్ల శాఖ డీఐజీ కుంతల్ కిశోర్ స్పందించారు. బరేలీ జైలు నుంచి వీడియో లైవ్‌ స్ట్రీమింగ్‌ అయిన ఘటనపై విచారణ జరుపుతున్నాం. శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఫోన్‌ ఎవరిచ్చారనేది దర్యాప్తులో తేలుతుందని, దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..