AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆమె వయసు ఎంత..? వాడి వయసు ఎంత..? శారీరకంగా చేరువై.. చివరకు..

విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుందని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ పరిచయాన్ని కాస్త శారీరక సంబంధంగా మలిచాడు. ఇంతలోనే ఇంకో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. సీన్ కట్ చేస్తే యువకుడి లవ్ స్టోరీ తెలుసుకొని తననే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ ముందు పెట్టింది ఒంటరి మహిళ. దీంతో ప్రేమ పెళ్లి కోసం ఇన్నాళ్ల రహస్య బంధాన్ని తెంపేస్తూ...మహిళను కిరాతకంగా హత్య చేశాడు.

Telangana: ఆమె వయసు ఎంత..? వాడి వయసు ఎంత..? శారీరకంగా చేరువై.. చివరకు..
Vijay - Swarmalatha
Boorugu Shiva Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 30, 2025 | 6:07 PM

Share

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి పీఎస్ పరిధిలో ఈ నెల 8న ఓ మహిళ హత్య వెలుగు చూసింది. సదరు మహిళ మృతదేహాన్ని దహనం చేయడంతో జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. హత్య, అనంతరం దహనం చేయడంతో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. దీంతో కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు కొద్దిరోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు తనతో శారీరక సంబంధం ఉన్న ఓ మహిళ అడ్డుపడుతుంది. దీంతో ఆమెను హత్య చేశాడు.

కొల్లాపూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన స్వర్ణలత టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్వర్ణలత భర్తతో విడాకులు తీసుకొని గత ఏడేళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన యువకుడు విజయ్ కుమార్‌(23)తో పరిచయం ఏర్పడింది. ఆమె అతని కంటే దాదాపు 15 ఏళ్లు పెద్దది. అయినా హద్దులు దాటారు.  శారీరకంగా దగ్గరయ్యారు.

తననే పెళ్లి చేసుకోవాలని స్వర్ణలత డిమాండ్…

అయితే కొన్నాళ్ల క్రితం నుంచి విజయ్ ఇంకో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ ఇంతలోనే ఈ విషయం స్వర్ణలతకు తెలియడంతో సదరు యువతిని దూరం పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. లేదంటే మనిద్దరం కలిసి ఉన్న ఫోటోలను మీ తల్లిదండ్రులకు చూపిస్తానని విజయ్ కుమార్‌ను బెదిరించింది. ఇలా రెండు, మూడు సార్లు బ్లాక్ మెయిల్‌కు పాల్పడడంతో స్వర్ణలత అడ్డు తొలగించుకోవాలని విజయ్ భావించాడు. ఈ క్రమంలోనే విజయ్ పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ వద్దకు వెళ్లి మాట్లాడాలని కోరింది స్వర్ణలత. అయితే ఇక్కడ అందరూ ఉంటారని చెప్పి కృష్ణా నదీతీరంలోని మంచాలకట్టకు వెళ్దామని చెప్పి స్వర్ణలతను అక్కడికి రమ్మని చెప్పాడు విజయ్ కుమార్. స్వర్ణలత మంచాలకట్ట వద్దకు రాగానే అక్కడి నుంచి తన బైక్ పైన సాకలి రాముని గుట్టపైకి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ మాట, మాట పెరిగి వాగ్వివాదం జరిగింది.

గొంతు నులిమి హత్య… ఆపై దహనం:

ఎలాగో అడ్డుతొలగించుకోవాలనుకున్న విజయ్ కుమార్ ఇదే అదునైన సమయంగా భావించి… స్వర్ణలత గొంతి పిసికి చంపేశాడు. ఇక హత్య ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించి స్వర్ణలత డెడ్ బాడీని దహనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. నేరుగా మంచాలకట్ట గ్రామానికి వెళ్లి అక్కడ రెండు లీటర్ల పెట్రోల్, అగ్గిపెట్టె కొని.. మళ్లి ఘటన స్థలికి వెళ్లాడు. అక్కడ స్వర్ణలత డెడ్ బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇక మేకల కాపర్లు ఈ నెల 13న డెడ్ బాడీని గమనించి మంచాలకట్ట గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఇక గ్రామకార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే శవం దహనం చేయడంతో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులకు కేసు సవాల్‌గా మారింది. సమీప ప్రాంతాల్లో ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో కొల్లాపూర్ సీఐ కార్యాలయంలో తన కూతురు స్వర్ణలత కనపించడం లేదని తండ్రి బాలస్వామి ఫిర్యాదు చేశాడు. బాలస్వామికి డెడ్ బాడీ వద్ద లభించిన గాజులు, ఆభరణాలు చూపించడంతో తన కుమార్తెనని నిర్ధారించాడు. ఇక సాంకేతిక ఆధారాలు, స్థానికంగా విచారణ ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెతో శారీరక సంబంధం నెరుపుతున్న విజయ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఒక మహిళతో శారీరక సంబంధం… ఇంకో యువతితో ప్రేమ వ్యవహారం… సీన్ కట్ చేస్తే మహిళ హత్య… ప్రేమికుడు జైలుకి వెళ్ళాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి