TSPSC: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో సంచలనం.. ఈ కేసు క్లోజ్ అయినట్లేనా? బదిలీలకు కారణమేంటి?
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పేపర్ లీకేజ్ కేసులో ఏం జరగబోతుంది? కేసుని మొదటి నుండి ఇన్వెస్టిగేషన్ చేసిన సిట్ అధికారుల బదిలీ తర్వాత ఈ కేసుపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ కేసులో ఏం జరగబోతుందన్న టెన్షన్ నెలకొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రోజుకొక సంచలనం బయటపడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పేపర్ లీకేజ్ కేసులో ఏం జరగబోతుంది? కేసుని మొదటి నుండి ఇన్వెస్టిగేషన్ చేసిన సిట్ అధికారుల బదిలీ తర్వాత ఈ కేసుపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ కేసులో ఏం జరగబోతుందన్న టెన్షన్ నెలకొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రోజుకొక సంచలనం బయటపడుతుంది. ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన దాంట్లో కీలక అధికారులైన సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్‌తో పాటు క్రైమ్ డీసీపీ శబరిష్ నేతృత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసుని సిట్ కు బదిలీ చేసింది. సిట్ చీఫ్‌గా ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పటివరకు టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారంలో 90 మంది వరకు అరెస్టు చేశారు.
సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ బదిలీ..
ఇన్వెస్టిగేషన్ సీరియస్‌గా జరుగుతున్న ఈ సమయంలో, గతవారం జరిగిన ఐపీఎస్ ట్రాన్స్ఫర్లలో సిట్ చీఫ్‌గా ఉన్న ఏఆర్ శ్రీనివాస్‌తో పాటుగా క్రైమ్ డీసీపీ శబరిష్ కూడా బదిలీ కావడంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పై అనుమానాలు మొదలయ్యాయి. కేసు మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న ఏఆర్ శ్రీనివాస్‌తో పాటుగా శబరిష్ బదిలీ తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటికే టీఎస్‌పిఎస్‌సీ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో 90 మంది వరకు సిట్ అరెస్ట్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీ తర్వాత ఈ కేసు అంతే స్పీడ్‌గా దర్యాప్తు కొనసాగుతుందా? లేక ఈ కేసు కథ కంచికి చేరుతుందా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
పొలిటికల్‌గా తీవ్ర దుమారం లేపిన పేపర్ లీకేజ్ కేసులో రాజకీయ నాయకుల పాత్రపై కూడా సిట్ దర్యాప్తు చేసింది. ఇంత సీరియస్‌గా దర్యాప్తు జరుగుతున్న సయమంలో కీలకమైన ఇద్దరు ఉన్నతాధికారులను ఒకేసారి బదిలీ చేయడం వెనకాల కారణం ఏమై ఉంటుందని ఉద్యోగార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా? లేక కేసును మూలకు పడేస్తుందా? అనేది చూడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..