AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఐటీ కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసులు కీలక సూచన.. ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేలా

Hyderabad Traffic Rules: భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచన చేశారు. అన్నీ కంపెనీల ఉద్యోగులు ఒకే సమయానికి బయటికి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సైబరాబాద్ పోలీసుల ఆలోచన చేశారు. ఐక్య సెంటర్ కేంద్రంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా హైదరాబాద్...

Hyderabad: ఐటీ కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసులు కీలక సూచన.. ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేలా
Hyderabad
Vijay Saatha
| Edited By: |

Updated on: Jul 25, 2023 | 5:59 PM

Share

హైదరాబాద్, జులై 25: భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచన చేశారు. అన్నీ కంపెనీల ఉద్యోగులు ఒకే సమయానికి బయటికి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సైబరాబాద్ పోలీసుల ఆలోచన చేశారు. ఐక్య సెంటర్ కేంద్రంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా హైదరాబాద్ పోలీసులు ఆలోచన చేశారు. ఇందులో భాగంగా కంపెనీలను మొత్తం మూడు ఫేజ్‌లుగా కంపెనీలను విభజించారు. ఉద్యోగులను సాయంత్రం ఇళ్లకు పంపే సమయంలో వ్యత్యాసం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఫేజ్ 1 లోని కంపెనీలు సాయంత్రం 3 గంటలకు, ఫేజ్‌ 2 లోని కంపెనీలు సాయంత్రం నాలుగున్నరకు, ఫేజ్‌ 3లోని కంపెనీలు సాయంత్రం మూడు నుంచి 6 గంటల మధ్యలో ఉద్యోగులను పంపాలని సూచించారు.

ఫేజ్‌ 1లో ఉన్న కంపెనీలు ఇవే..

రహేజా మైండ్ స్పేస్ లోని అన్ని కంపెనీలతో పాటు TCS , HSBC ,Dell, ఫినిక్స్ బిల్డిండ్‌లో కంపెనీలు Oracle, qualcom, tech Mahindra, Purva summit, watermark కాంప్లెక్స్ లోని అన్ని కంపెనీలు.

ఫేజ్‌ 2లోని కంపెనీలు..

Knowledge City లోని అన్ని కంపెనీలు, Knowledge పార్క్ లోని అన్ని కంపెనీలు, T – hub, Galaxy, LTI,TWITZ , Commerzome, RMZ nexcity, sky view 10&20 ,diyarsree, Orion, ascendas కంపెనీలు ఉన్నాయి.

ఫేస్ 3లోని కంపెనీలు..

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, శన్షురస్, బ్రాడ్వే, వర్చుసా, BSRIT పార్క్, ఐసిఐసిఐ బిల్డింగ్, వేవ్ రాక్, అమెజాన్, హానీ వేల్, హిటాచి, సత్వా, క్యాప్‌ జెమిని,GAR లోని కమొనిలు, ఫ్రాంక్లిన్, Q city, DLF లోనీ అన్ని కంపెనీలు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..