అవిశ్రాంత మాస్టరు.. 85 ఏళ్ల వయస్సులోనూ పాఠాలు బోధిస్తున్న బడిపంతులు.. ఎందరికో ఆదర్శంగా..

Khammam News: 85 సంవత్సరాల వయసులో కూడా ఎటువంటి అలుపు సొలుపు లేకుండా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలుగు పాటలు బోధిస్తూ ముందుకు సాగుతున్నారు. పాఠశాలలో విద్యార్థులకు బోధనకే పరిమితం కాకుండా పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పించడం కోసం గ్రామంలోని దాతలను సమీకరించి పాఠశాలకు వసతులు సమకూర్చటంలో రామారావు తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అవిశ్రాంత మాస్టరు.. 85 ఏళ్ల వయస్సులోనూ పాఠాలు బోధిస్తున్న బడిపంతులు.. ఎందరికో ఆదర్శంగా..
Retired School Teacher
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 25, 2023 | 4:35 PM

ఖమ్మం,జులై 25: అతను అవిశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన కాల పరిమితి అయిపోయిన గాని తన వృత్తి మీద ఉన్న ఆసక్తితో తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని  సిద్దనేనిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్య బోధిస్తూ పలువురు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు.. సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. కానీ, ఈ అవిశ్రాంత ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయినా తాను బోధించే పాఠాలు పలువురు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని, వారి జీవితాలకు పునాదులు వేస్తాయనే సంకల్పంతో.. విద్యా బోధనలు పలువురు విద్యార్థుల భవిష్యత్తుకు మేలు జరుగుతాయని ఆశయంతో అవిశ్రాంత ఉపాధ్యాయుడుగా తన జీవితం కొనసాగిస్తున్నాడు 85 సంవత్సరాల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామారావు..

ఖమ్మం జిల్లా మధిర మండలం సిద్ధినేని గూడెం గ్రామానికి చెందిన ఏడుకొండల రామారావు 1997లో తెలుగు ఉపాధ్యాయునిగా ఎర్రు పాలెం మండలం రామన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందారు. అప్పటినుంచి ఖాళీగా ఉండకుండా తన స్వగ్రామమైన మధిర మండలం సిద్ధినేనిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎటువంటి ఫలితం ఆశించకుండా విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధిస్తున్నారు .1960లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధుల్లో చేరిన ఆయన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేసి విద్యార్థుల ప్రజల మన్ననలను పొందారు. 85 సంవత్సరాల వయసులో కూడా ఎటువంటి అలుపు సొలుపు లేకుండా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలుగు పాటలు బోధిస్తూ ముందుకు సాగుతున్నారు. పాఠశాలలో విద్యార్థులకు బోధనకే పరిమితం కాకుండా పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పించడం కోసం గ్రామంలోని దాతలను సమీకరించి పాఠశాలకు వసతులు సమకూర్చటంలో ఏడుకొండల రామారావు తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించటంతో పాటు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తూ, పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. 85 సంవత్సరాల వయసులో కూడా ప్రతి రోజూ పాఠశాలకు సమయానికి రావడం, విద్యార్థులకు పాఠాలు బోధించడం ఆయన చేస్తున్న సేవలను గ్రామస్తులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పలువురు అభినందిస్తున్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు విద్యార్థులకు పాఠాలు బోధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని రిటైర్డ్ మాస్టర్ రామారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…