Hyderabad: ఏం తెలివిరా నాయనా..! చిత్రవిచిత్ర మార్గాల్లో గోల్డ్‌ స్మగ్లింగ్.. వీడియో వైరల్

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడు సుమారు రెండు కిలోల బంగారాన్ని..

Hyderabad: ఏం తెలివిరా నాయనా..! చిత్రవిచిత్ర మార్గాల్లో గోల్డ్‌ స్మగ్లింగ్.. వీడియో వైరల్
Gold Smuggling
Follow us

|

Updated on: May 24, 2023 | 1:06 PM

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడు సుమారు రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు చేపట్టగా.. నిందితుడు ఎమర్జెన్సీ లైట్‌ బ్యాటరీలో అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. సుమారు రూ.1.82 కోట్ల విలువైన 2.915 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

కాగా హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టుబడటం ఇదేం తొలిసారి కాదు. నిత్యం అనేక మార్గాల్లో బంగారం నగరంలోకి అక్రమంగా తీసుకురావాలని కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పేస్ట్‌ల రూపంలో, చాక్లెట్ల రూపంలో, బిస్కెట్ల రూపంలో ఇలా రకరకాల మార్గాల్లో బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో నేడు మరోమారు అధికారులు గోల్డ్‌ స్మగ్లింగ్‌ గుట్టును ఛేదించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.