అయ్యగారికోసం రంగంలో ఆ హీరోయిన్.. అఖిల్ సినిమాలో మరో డిజాస్టర్ బ్యూటీ..
అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ హీరో , హాలీవుడ్ హీరోలను తలదన్నే హ్యాండ్సమ్.. ఇవన్నీ ఉన్నా.. అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదని చెప్పాలి. మొన్నామధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించుకుంది .

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు. మొన్నామధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురి చేసింది. మొదటి సినిమా మొదలుకొని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. అఖిల్‌తో చేసిన దర్శకులు కూడా ఆషామాషీ వ్యక్తులు కాదు. టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది. ఇక ఇప్పుడు చిన్న గ్యాప్ తీసుకున్న అఖిల్ లెనిన్ అనే సినిమాతో రానున్నాడు.
సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!
చివరిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఈ సినిమాతో దారుణంగా నిరాశపడ్డారు. దీంతో అఖిల్ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈసారైనా అఖిల్ హిట్ కొడతాడా.? అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో పెరిగింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ సాలిడ్ హిట్‌తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అఖిల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ సినిమా లైనప్ చేశాడు. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్
ఈ సినిమాలో ముందుకు యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లోకి ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బ్యూటీ కూడా అఖిల్ సినిమాలో మెరవనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు లైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ కు తిరిగి చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు అఖిల్ సినిమాలో కనిపించనుందని తెలుస్తుంది. ఓ స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో కలిసి అనన్య నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








