Narendra Modi: ఈనెల 11న మరోసారి హైదరాబాద్ కు ప్రధాని మోడీ

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ వారంలో రెండోసారి హైదరాబాద్‌కు మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 7 న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ విజయవంతమైంది. దీంతో మరోసారి నవంబర్ 11న హైదరాబాద్ కు ప్రధాని రానున్నారు. సికింద్రాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ నిర్వహించనుంది. ఈ సభకు మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన టూర్‌కు సంబంధించి

Narendra Modi: ఈనెల 11న మరోసారి హైదరాబాద్ కు ప్రధాని మోడీ
Prime Minister Narendra Modi will attend a huge public meeting at Parade Ground in Hyderabad on November 11th
Follow us
Ashok Bheemanapalli

| Edited By: TV9 Telugu

Updated on: Nov 09, 2023 | 5:35 PM

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ వారంలో రెండోసారి హైదరాబాద్‌కు మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 7 న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ విజయవంతమైంది. దీంతో మరోసారి నవంబర్ 11న హైదరాబాద్ కు ప్రధాని రానున్నారు. సికింద్రాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ నిర్వహించనుంది. ఈ సభకు మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేశారు పీఎంవో అధికారులు.

ఈనెల 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా ‘మాదిగ విశ్వరూప సభ’ నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. సభకు ప్రధాని మోడీతోపాటు బీజేపీ అగ్ర నాయకులందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభలోని ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 11న సాయంత్రం 4:45 కు ప్రధాని మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొనున్నారు. సాయంత్రం పెరేడ్ గ్రౌండ్లో జరిగే మాదిగ విశ్వరూప సభకు మోడీ హాజరవుతారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటల నుండి 5:45 వరకు మాదిగ విశ్వరూప సభ జరగనుంది. దాదాపు 45 నిమిషాల పాటు మోడీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఉండనున్నారు. సభ ముగిసిన అనంతరం 6 గంటలకు మోడీ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకే వారంలో రెండుసార్లు ప్రధాని మోడీ హైదరాబాద్‌కి రావడం విశేషం.. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ పై ఈ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎప్పటినుండో ఆందోళన బాటపడుతున్న ఎస్సీలకు ఈ సభ ద్వారా తమ ఆకాంక్ష నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోడీ టూర్ కు కొద్దిరోజుల ముందే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఎస్సీ నాయకులు ముట్టడించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణ పై ప్రకటన చేయాలని నేతలు పట్టుబడుతున్నారు. దీంతో ఈ నెల 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే సభ లో ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ పై ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..