Hyderabad Metro: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మెట్రో టైమింగ్స్‌లో కీలక మార్పులు..
న్యూ ఇయర్ సందర్భంగా హైాదరాబాద్ ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త అందించారు. డిసెంబర్ 31న అర్థరాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మెట్రో సమయాలను అధికారులు పొడిగించారు. అర్థరాత్రి వరకు సర్వీసులు అందించనున్నాయి.

హైదరాబాద్ ప్రజలకు మెట్రో అధికారులు గుడ్‌న్యూస్ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో పని వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31న మెట్రో టైమింగ్స్‌లో కీలక మార్పులు చేశారు. డిసెంబర్ 31న అర్థరాత్రి ఒంటి గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కారణంగా ప్రజల రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. వేరే వేరే ప్రాంతాలకు ఎక్కువగా తిరుగుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాత్రి వరకు పొడిగించినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి.
సాధారణ రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 31న అర్థరాత్రి 1 గంటల వరకు మెట్రోలు తిరుగనున్నాయి. న్యూ ఇయర్ వేడుకల కోసం పార్టీలకు, ఈవెంట్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు. డిసెంబర్ 31 రాత్రి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కడికైనా వెళ్లాలంటే గంటలకు గంటలు సమయం పట్టవచ్చు. అదే మెట్రో ద్వారా గమ్యస్థానానికి త్వరగా చేసుకోవచ్చు. అయితే కొత్త ఏడాది వేడుకల సందర్భంగా మెట్రో రైళ్లు, స్టేషన్లలో పోలీసులు, మెట్రో సిబ్బంది నిఘా ఎక్కువగా ఉండనుంది. దీంతో ప్రయాణికులు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.
ప్రతీ ఏడాది తరహాలోనే
ప్రతీ ఏడాది డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు అందిస్తుంది. ఈ సారి కూడా అదే విధంగా నడపాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రజలకు ప్రయోజనం జరగడంతో పాటు మెట్రోకు కూడా ఆదాయం లభించనుంది. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు మెట్రో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ప్రత్యేక పండుగలు, ఈవెంట్ల సమయాల్లో పనివేళలను పొడిగిస్తుంది.
