ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ ఇవ్వాలి వీడియో
తెలంగాణ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల పెండింగ్ డిమాండ్లపై ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో గళమెత్తారు. ఆరు డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ అమలు, ఓపీఎస్ హామీల ఉల్లంఘన, పోలీసుల బకాయిల విడుదలలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. హామీలకు కట్టుబడి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ 2025 సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాల వంటివారని పేర్కొంటూ, వారికి డీఏలు, పీఆర్సీతో పాటు ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఆరు డీఏలు, పీఆర్సీని అమలు చేయలేదని హరీష్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 39 శాతం పీఆర్సీని అమలు చేసిందని గుర్తుచేశారు. ఈహెచ్ఎస్ పథకం అమలులో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ సేవింగ్స్ అందక వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, కొందరు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :