అంబేద్కర్ కోనసీమ జిల్లా వైనతేయ నదిలో మత్స్యకారులకు విచిత్రమైన చేప చిక్కింది. దీని తలపై గ్రిల్ లాంటి భాగం ఉండడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ చేపలు తిమింగలాలు వంటి పెద్ద చేపలకు అతుక్కుని, వాటి ఆహార అవశేషాలను తింటూ జీవిస్తాయి. దీని శాస్త్రీయ నామం ఎకెనీస్ నాక్రటీస్.