సింగపూర్‌లోని ఓ వ్యక్తి రూ.1.75 కోట్ల అప్పు తీసుకుని వడ్డీలు, పెనాల్టీలతో అది రూ.147 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో సొంత ఇంటిని అమ్మి అద్దెకు ఉంటున్నాడు. ఈ వ్యవహారంపై సింగపూర్ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అధిక వడ్డీలు వసూలు చేసే ప్రైవేటు రుణదాతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.