ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. సాధారణంగా రైలు టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలి. అయితే ప్రయాణించే రోజున టికెట్లు దొరకక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఇండియన్ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇది అత్యవసర, చివరి నిమిషంలో ప్రయాణించే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.