AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పుతిన్ ఇంటిపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి యత్నం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

పుతిన్‌ ఇంటిపై ఉక్రెయిన్‌ దాడిచేసినట్టు రష్యా ఆరోపిస్తోంది. రష్యా వాయువ్య ప్రాంతంలోని పుతిన్‌ నివాసంపై 91 డ్రోన్లతో దాడి జరిగిందని రష్యా చెబుతోంది. దాడుల వార్తలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిస్థాపన కోసం సాగుతున్న యత్నాలపైనే అన్నిపక్షాలు దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

PM Modi: పుతిన్ ఇంటిపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి యత్నం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
PM Modi reacts to reports of attack on Putin’s house
Shaik Madar Saheb
|

Updated on: Dec 30, 2025 | 6:42 PM

Share

రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇప్పటికే.. సుధీర్ఘకాలంగా యుద్ధం జరగుతుండగా.. తాజాగా.. ఉక్రెయిన్.. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. రష్యాలోని నోవ్‌గొరొడ్‌ ప్రాంత గ్రామంలో ఉన్న పుతిన్‌ ఇంటిపై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్‌ ప్రయత్నించిందని రష్యా పేర్కొంది.. మొత్తం 91 డ్రోన్లను ఆ దేశం ప్రయోగించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తెలిపారు. అయితే అన్నింటినీ నిర్వీర్యం చేశామని, ఇంటికి ఎటువంటి నష్టం కలగలేదని వెల్లడించారు. అయితే.. ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకు ఉందని స్పష్టంచేశారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి ఇదని.. తాము చూస్తూ ఊరుకోమంటూ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వ్యాఖ్యానించారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలు ఆందోళన కలిగించాయని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని, దౌత్యంపై తిరిగి దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఘర్షణలకు ముగింపు పలకడం, శాంతి సాధనకు ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నం.. అత్యంత ఆచరణీయ మార్గమన్న ప్రధాని మోదీ.. అన్ని భాగస్వామ్య పక్షాలు వీటిపైనే దృష్టి పెట్టాలని, విఘాతం కలిగించే చర్యలకు అన్ని వర్గాలు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.

కాగా.. పుతిన్ ఇంటిపై దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా స్పందించారు.. ఉక్రెయిన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. దీని గురించి పుతిన్‌ తనకు వెల్లడించారని తెలిపారు. ఉక్రెయిన్‌ చర్య తనకు ఆగ్రహం తెప్పించిందతీ.. దాడి చేయడం సరికాదంటూ వ్యాఖ్యానించారు.

అంతకుముందు.. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ మధ్య ఉన్న అధ్యక్షుడు పుతిన్ రాష్ట్ర నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడిని ప్రారంభించిందని రష్యా పేర్కొంది. రాయిటర్స్ ప్రకారం, డిసెంబర్ 28-29 తేదీలలో నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని నివాసంపై 91 లాంగ్-రేంజ్ డ్రోన్‌లతో కాల్పులు జరిగాయని, అవన్నీ రష్యన్ వైమానిక రక్షణ దళాలు అడ్డగించి నాశనం చేశాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..