AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaheen Afridi : ఆస్ట్రేలియా నుంచి అఫ్రిదీ అవుట్..వరల్డ్ కప్ భయంతో పాక్ బోర్డు సంచలన నిర్ణయం

Shaheen Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీకి ఆస్ట్రేలియా గడ్డపై గట్టి షాక్ తగిలింది. బిగ్ బాష్ లీగ్‎లో మెరుపులు మెరిపిద్దామని వెళ్లిన ఈ స్పీడ్‌స్టర్, అనూహ్యంగా గాయం బారిన పడి టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.

Shaheen Afridi : ఆస్ట్రేలియా నుంచి అఫ్రిదీ అవుట్..వరల్డ్ కప్ భయంతో పాక్ బోర్డు సంచలన నిర్ణయం
Shaheen Afridi
Rakesh
|

Updated on: Dec 30, 2025 | 6:39 PM

Share

Shaheen Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీకి ఆస్ట్రేలియా గడ్డపై గట్టి షాక్ తగిలింది. బిగ్ బాష్ లీగ్‎లో మెరుపులు మెరిపిద్దామని వెళ్లిన ఈ స్పీడ్‌స్టర్, అనూహ్యంగా గాయం బారిన పడి టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదేశాల మేరకు అతను ఆస్ట్రేలియాను వీడి స్వదేశానికి బయలుదేరాడు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రిస్బేన్ హీట్ జట్టు తరపున ఆడుతున్న షాహీన్ అఫ్రిదీకి, డిసెంబర్ 27న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయమైంది. బౌలింగ్ చేస్తున్న సమయంలో 14వ ఓవర్లో అతని కుడి మోకాలికి తీవ్రమైన నొప్పి రావడంతో, అతను మైదానంలోనే కుంటుతూ కనిపించాడు. కనీసం తన ఓవర్‌ను కూడా పూర్తి చేయలేక మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. మోకాలి గాయం తీవ్రతను గమనించిన పీసీబీ, అతనికి సరైన చికిత్స అందించేందుకు వెంటనే పాకిస్థాన్‌కు తిరిగి రావాలని కోరింది.

తన నిష్క్రమణపై షాహీన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “బ్రిస్బేన్ హీట్ టీమ్, ఫ్యాన్స్ చూపించిన ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఊహించని గాయం వల్ల బోర్డు నన్ను వెనక్కి పిలిచింది. త్వరలోనే మళ్ళీ మైదానంలోకి వస్తానని ఆశిస్తున్నాను. అప్పటి వరకు నా టీమ్‌కు బయట నుంచే మద్దతు ఇస్తాను” అని పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో జరగబోయే వరల్డ్ కప్ నాటికి షాహీన్ ఫిట్‌నెస్ పాక్ జట్టుకు చాలా కీలకం. అందుకే పీసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతనికి చికిత్స అందించనున్నారు.

నిజానికి ఈసారి బిగ్ బాష్ లీగ్ షాహీన్ అఫ్రిదీకి అస్సలు కలిసిరాలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతను కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. పైగా అతని ఎకానమీ రేటు 11.19గా ఉంది, అంటే బ్యాటర్లు అతడిని చితక్కొట్టారు. డెబ్యూ మ్యాచ్‌లోనే వరుసగా రెండు బీమర్లు (హై ఫుల్ టాస్) వేసినందుకు అంపైర్లు అతడిని బౌలింగ్ నుంచి తొలగించారు. ఆరంభంలోనే అపశ్రుతి ఎదురైన షాహీన్, ఇప్పుడు గాయంతో సీజన్ మొత్తానికి దూరం కావడం అతని ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆస్ట్రేలియా నుంచి అఫ్రిదీ అవుట్..పాక్ బోర్డు సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా నుంచి అఫ్రిదీ అవుట్..పాక్ బోర్డు సంచలన నిర్ణయం
ఈ కమెడియన్ గుర్తున్నాడా? ఈయన కూతురు కూడా తెలుగులో స్టార్ నటి
ఈ కమెడియన్ గుర్తున్నాడా? ఈయన కూతురు కూడా తెలుగులో స్టార్ నటి
జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..