AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : 6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. బలం కావాలి.. శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీకి బ్రేకులు!

Shreyas Iyer : టీమిండియా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకు ఇది మింగుడుపడని వార్త. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన అయ్యర్, త్వరలోనే జట్టులోకి వస్తాడని అందరూ ఆశించారు. కానీ అతని కోలుకునే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

Shreyas Iyer : 6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. బలం కావాలి.. శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీకి బ్రేకులు!
Shreyas Iyer
Rakesh
|

Updated on: Dec 30, 2025 | 7:10 PM

Share

Shreyas Iyer : టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకు ఇది మింగుడుపడని వార్త. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన అయ్యర్, త్వరలోనే జట్టులోకి వస్తాడని అందరూ ఆశించారు. కానీ అతని కోలుకునే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ పొందుతున్న శ్రేయస్ అయ్యర్, నెట్స్‌లో బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఆస్ట్రేలియాలో తగిలిన గాయం కారణంగా అతని శరీర బరువు దాదాపు 6 కిలోలు తగ్గిపోయింది. బరువు మళ్ళీ పెరుగుతున్నప్పటికీ అతని శరీరంలో కండరాల సాంద్రత తగ్గిపోయిందని వైద్యులు గుర్తించారు. దీనివల్ల అతని శారీరక బలంపై ప్రభావం పడిందని, పూర్తి స్థాయిలో కోలుకోకుండా మైదానంలోకి దింపడం రిస్క్ అని బీసీసీఐ భావిస్తోంది. అయ్యర్ వన్డే ఫార్మాట్‌లో అత్యంత కీలక ఆటగాడు కావడంతో, అతని విషయంలో తొందరపడకూడదని బోర్డు నిర్ణయించుకుంది.

ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి శ్రేయస్ అయ్యర్ ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 3, 6 తేదీల్లో జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో అతను ఆడతాడని అందరూ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం లేదని సమాచారం. జనవరి 9 నాటికి అతనికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లభించే అవకాశం ఉంది, అయితే ఇది న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లోకి తీసుకోవడం సెలెక్టర్లకు సవాలుగా మారింది.

ఒకవేళ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి రుతురాజ్ గైక్వాడ్ సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికా పై అద్భుతమైన సెంచరీతో రుతురాజ్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. అయ్యర్ గైర్హాజరీలో రుతురాజ్‌కు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. శ్రేయస్ అయ్యర్ తన కెరీర్‌లో ఇప్పటికే పలుమార్లు వెన్ను గాయంతో బాధపడ్డారు. అందుకే ఈసారి మెడికల్ టీమ్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. శ్రేయస్ రీ-ఎంట్రీకి బ్రేక్
6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. శ్రేయస్ రీ-ఎంట్రీకి బ్రేక్
చెవిలో గులిమి తీస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
చెవిలో గులిమి తీస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
ట్రైన్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ నుంచి ఆఫర్
ట్రైన్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ నుంచి ఆఫర్
బిజీ లైఫ్‌లో స్ట్రెస్‌ను జయించడానికి గీత చెప్పే పవర్ఫుల్ మంత్ర!
బిజీ లైఫ్‌లో స్ట్రెస్‌ను జయించడానికి గీత చెప్పే పవర్ఫుల్ మంత్ర!
దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర..
దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర..
30 ఏళ్ల కల.. ట్రైన్‌తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిన జనం!
30 ఏళ్ల కల.. ట్రైన్‌తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిన జనం!
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి.. స్పందించిన ప్రధాని మోదీ..
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి.. స్పందించిన ప్రధాని మోదీ..
తరుణ్ సినిమాలు మానేయడానికి కారణం అదే..
తరుణ్ సినిమాలు మానేయడానికి కారణం అదే..
ఆస్ట్రేలియా నుంచి అఫ్రిదీ అవుట్..పాక్ బోర్డు సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా నుంచి అఫ్రిదీ అవుట్..పాక్ బోర్డు సంచలన నిర్ణయం
ఈ కమెడియన్ గుర్తున్నాడా? ఈయన కూతురు కూడా తెలుగులో స్టార్ నటి
ఈ కమెడియన్ గుర్తున్నాడా? ఈయన కూతురు కూడా తెలుగులో స్టార్ నటి