AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్.. ఎప్పుడంటే?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది.దీంతో జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌కు సిద్ధమయ్యారు అధికారులు. ఇందులో భాగంగానే ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు.

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్.. ఎప్పుడంటే?
Bhogapuram International Airport
Anand T
|

Updated on: Dec 30, 2025 | 6:18 PM

Share

విజయనగరం భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తైంది. దీంతో ఎయిర్‌పోర్టులో ట్రయల్‌ రన్‌ చేసేందుకు సిద్దమయ్యారు అధికారులు. ఇందులో భాగంగానే జనవరి 4న భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్ చేరుకోనుంది. ఫైనల్ టెస్ట్ రన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ ఢిల్లీ నుంచి బయల్దేరి జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురంకు ఎయిర్‌పోర్టుకు చేరకోనుంది. ఈ టెస్ట్‌ రన్‌లో భాగంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్, ఎయిర్ పోర్టు అథారిటీ, DGCA ఉన్నతాధికారులు ఎయిర్‌ ఇండియా విమానంలో భోగాపురం ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు.

ఏపీ ప్రజలకు మరికొద్ది రోజుల్లోనే మరో కొత్త ఎయిర్‌పోర్టు అందుబాబులోకి రానుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టల్ రామ్మోహన్‌ నాయుడు చొరవతో విజయనగరంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో ఫైనల్‌ టెస్ట్‌ రన్‌ నిర్వహించేందుకు సిద్దమయ్యారు అధికారులు. ఇప్పటికే దాదా 95శాతం నిర్మాణ పనులు పూర్తికాగా మరో 5శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిని కూడా వచ్చే ఏడాది జూన్‌ లోపు పూర్తి చేసి.. ఆగస్ట్‌లో ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

అయితే జనవరి 4వ తేదీన ఎయిర్‌పోర్టులో చివరి ట్రయల్‌రన్‌ పూర్తి చేసిన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఇక ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు ఏపీ పర్యాటకం కూడా ఊపందుకోనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.