Indian Railways: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త అందించిన రైల్వేశాఖ..
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. స్కూళ్లు, ఆఫీసులకు వరుస సెలవులు రానుండటంతో తమ సొంతూళ్లకు ప్రయాణమవుతారు. దీంతో హైదరాబాద్ సగానికి సగం ఖాళీ కానుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది.

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే గత కొద్ది రోజులుగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తూ వస్తోంది. దాదాపు 600 వరకు ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్ల వివరాలను వెల్లడించింది. వాటిల్లో ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని నలుమూలలకు ఈ ప్రత్యేక రైళ్లను తిప్పనుంది. ప్రైవేట్ బస్సులు పండుగ రద్దీ కారణంగా అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. దీంతో రైళ్లల్లో తక్కువ ఛార్జీతో ప్రజలు ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా సౌకర్యవంతంగా తమ సొంతూళ్లకు వెళ్లవచ్చు. తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్ల వివరాలను రైల్వేశాఖ ప్రకటించింది.
ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ ఇవే..
-కాకినాడ-వికారాబాద్(07460) కాకినాడలో 18.20 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 8న అందుబాటులో ఉంటుంది.
-వికారాబాద్-పార్వతీపురం(07461) రైలు 20.30 గంటలకు వికారాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు 20.30 గంటలకు తన గమ్యస్థానానికి చేరుతుంది. ఇది 9,11వ తేదీల్లో సర్వీసులు అందించనుంది.
-పార్వతీపురం-వికారాబాద్(07462) ట్రైన్ 18.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 11.30 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 10న ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
-పార్వతీపురం-కాకినాడ(07463) రైలు 18.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 1.00 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఈ సర్వీసులు 12వ తేదీ అందుబాటులో ఉండనున్నాయి.
-సికింద్రాబాద్-పార్వతీపురం(07464) రైలు 22.00 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 14.30 గంటలకు చేరుకుంటుంది. 8వ తేదీ అందుబాటులో ఉంటుంది.
-పార్వతీపురం-సికింద్రాబాద్(07465) రైలు 18.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 10 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. జనవరి 9వ తేదీన అందుబాటులో ఉంటుంది.
-కాకినాడ-వికారాబాద్(07186) ట్రైన్ 16.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. 7,9వ తేదీల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
-వికారాబాద్-కాకినాడ(07185) రైలు 17.35 గంటలకు బయల్దేరి 8.30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. జనవరి 8వ తేదీన అందుబాటులో ఉంటుంది
-వికారాబాద్-కాకినాడ(07187) ప్రత్యేక రైలు 19.00 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 11 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. జనవరి 10వ తేదీ అందుబాటులో ఉంటుంది.
Additional #Sankranti special trains between various destinations @RailMinIndia @drmvijayawada @drmsecunderabad @drmhyb pic.twitter.com/6z1HEBmWMQ
— South Central Railway (@SCRailwayIndia) December 30, 2025
