AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త సంవత్సరంలో కుజుడిదే హవా! వారికి అధికార యోగం, ఆదాయ వృద్ధి

కొత్త సంవత్సరంలో కుజ గ్రహం అధిక కాలం బలంగా ఉండనుంది. దీనివల్ల ఆరు రాశుల వారికి రాజయోగం, రాజకీయ ప్రాబల్యం, ఉన్నతోద్యోగాలు, స్థిరాస్తుల వృద్ధి, సంతాన ప్రాప్తి లభించే అవకాశముంది. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులు కుజుడి అనుకూల ప్రభావంతో సంపద, ఉద్యోగ ఉన్నతి, ఆస్తి లాభాలతో పాటు అనేక శుభ ఫలితాలను పొందుతాయి.

కొత్త సంవత్సరంలో కుజుడిదే హవా! వారికి అధికార యోగం, ఆదాయ వృద్ధి
Career Astrology 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 30, 2025 | 5:32 PM

Share

కొత్త సంవత్సరంలో ఒకటి రెండు నెలలు తప్ప మిగిలిన నెలల్లో కుజ గ్రహం బాగా బలంగా ఉండబోతోంది. కుజ గ్రహం బలంగా ఉండే పక్షంలో అధికార యోగం, రాజకీయ ప్రాబల్యం, ఉన్నతోద్యోగాలు, స్థిరాస్తుల వృద్ధి, సంతాన ప్రాప్తి వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులు ఈ కుజుడి వల్ల అనేక విధాలుగా లబ్దిపొందడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ది చెందడం, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం కావడం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడం, సంపద పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు ఈ రాశికి ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో తప్ప మిగిలిన కాలమంతా బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఈ రాశివారికి ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతికి, ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వీరికి అధికార యోగం పట్టడంతో పాటు, స్థిరాస్తులు బాగా వృద్ది చెందడం, గృహ, వాహన యోగాలు కలగడం వంటివి కూడా జరుగుతాయి. జనవరి 15తో మొదలయ్యే వీరి ప్రాభవం డిసెంబర్ 26 వరకు తిరుగు లేకుండా కొనసాగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశివారిని ఈ ఏడాది ఉచ్ఛ స్థితికి తీసుకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లోనే కాక సంపద పరంగా కూడా వీరు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అత్యధికంగా అందుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి.
  3. సింహం: ఈ రాశికి కుజుడు ఈ ఏడాది పూర్ణ శుభుడుగా మారడం జరుగుతుంది. ఈ రాశికి కుజుడు అత్యంత శుభుడైనందువల్ల ఉద్యోగంలో అధికార యోగాన్నిఇవ్వడంతో పాటు, ప్రభుత్వంలో ఉన్న తోద్యోగం కల్పించే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు విశేష లాభాలనిస్తాయి.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ఏడాది మొత్తంలో రెండు నెలలు మాత్రమే బలహీనుడవుతున్నందువల్ల మిగిలిన నెలల్లో ఈ రాశివారి జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. అనేక పర్యా యాలు రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఒక సంపన్నుడుగా, ప్రముఖుడుగా ఎదిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి కుజుడు పూర్తిగా సంవత్సరమంతా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కుజుడి వల్ల ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. సంపన్న కుటుంబంలో వివాహ సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశికి అత్యధికంగా సంపదలను ఇవ్వడంతో పాటు ఉద్యోగంలో పదోన్నతులు కూడా కలిగిస్తాడు. వీరికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అత్యంత ప్రముఖులకు కూడా బాగా సన్నిహితం అవుతారు.