AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇదెక్కడి లొల్లిరా సామీ.. మద్యం తాగకుండానే మత్తు తలకెక్కింది.. కట్ చేస్తే.!

నానాటికీ యువత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావమా మరి సినిమాల ప్రభావమా తెలియదు కానీ, పోకిరీల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. సరిగా లోకజ్ఞానం లేని వయసులో ఉన్నవాళ్లు సైతం తమదే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తుండడం చూస్తే ఏం అనాలో అర్థం కాని పరిస్థితి.

Hyderabad: ఇదెక్కడి లొల్లిరా సామీ.. మద్యం తాగకుండానే మత్తు తలకెక్కింది.. కట్ చేస్తే.!
Liquor Selling
Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 18, 2024 | 1:27 PM

Share

నానాటికీ యువత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావమా మరి సినిమాల ప్రభావమా తెలియదు కానీ, పోకిరీల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. సరిగా లోకజ్ఞానం లేని వయసులో ఉన్నవాళ్లు సైతం తమదే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తుండడం చూస్తే ఏం అనాలో అర్థం కాని పరిస్థితి. తాజాగా హైదరాబాద్ మహా నగరం పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

సరిగా యుక్త వయసు కూడా దాటని కొందరు యువకుల మధ్య మద్యం వల్ల వివాదం తలెత్తింది. సరదాగా మందు కొడదామని అనుకున్నారో ఏమో.. ఏకంగా రోడ్డు మీదే పంచాయితీ పెట్టేశారు. మందు తాగిపించాలని అందులో ఓ యువకుడు తన ఫ్రెండ్స్‌తో అంటే దానికి ఒప్పుకోక పోగా.. లేదు నువ్వే మాకు తాగిపించాలని పట్టుబట్టారు. ఇది కాస్తా మాటామాటా పెరిగి పెద్ద వివాదమై కూర్చుంది. మద్యం తాగిపించాలని ఒత్తిడి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మధ్య దుమారం రేగింది. దీంతో చార్మినార్ ప్రాంతంలో నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగా ఒకరితో ఒకరు గొడవకు దిగారు. మద్యం కోసం సొంత స్నేహితులని కూడా చూడకుండా తిట్టుకున్నారు. ఈ గొడవ ఇలా జరుగుతుండగానే పోలీసులు రంగంలోకి దిగారు.

ఇది చదవండి: రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇది ఇక్కడితో ఆగదు అన్నట్లుగా ఆ యువకుల కుటుంబ సభ్యులు కూడా దీనిలో భాగమయ్యారు. పిల్లల మధ్య జరుగుతున్న గొడవలో పెద్దవాళ్లు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడంతో గొడవ మరింత ముదిరింది. జనాలు రాకపోకలు సాగించే రద్దీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు వెళ్లడానికి మరింత కష్టంగా మారింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా గొడవను ఒక దారికి తీసుకురావడానికి పోలీసులు తలలు పట్టుకున్నారు. వివాదం సద్దుమణగడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.

ఇది చదవండి: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే

ఇదిలా ఉండగా.. ఈ ఒక్క ఘటనే కాదు.. ఈ మధ్యకాలంలో పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి, రోడ్డుపై వెళ్లేవారిని ఇబ్బందులు పెడుతూ యువత పదేపదే హడావుడి చేస్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులు ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నా ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం చార్మినార్ మక్కా మసీదు సమీపంలో మద్యం తాగుతున్న యువత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు వ్యవస్థకే సవాలుగా మారింది. స్థానికులు, వాహనదారులు ఇలాంటి ఘటనలపై పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ మద్యం గొడవ ఏకంగా పాతబస్తీని ఆందోళనకు గురి చేసింది. ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు యువత ఎటువైపు పోతుందంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇది చదవండి: అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు.. కనిపెడితే ఖిలాడీవి నువ్వే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..