T20 World Cup: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచడమే కాదు.. గ్రూప్-స్టేజి నుంచి అదిరిపోయే మూడు విజయాలతో సూపర్-8 దశకు చేరుకుంది. సూపర్-8లో భారత్.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరగని టీమిండియా..

T20 World Cup: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 18, 2024 | 10:47 AM

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచడమే కాదు.. గ్రూప్-స్టేజి నుంచి అదిరిపోయే మూడు విజయాలతో సూపర్-8 దశకు చేరుకుంది. సూపర్-8లో భారత్.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరగని టీమిండియా.. సూపర్-8లో ఏమేరకు రాణిస్తుందోనన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో తలెత్తుతోంది. గత 8 టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో సూపర్-8 రౌండ్‌లో టీమిండియా అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసింది. దీంతో ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్స్.. ఈసారైన భారత్ అద్భుతంగా రాణించాలని.. లేదంటే అర్ధాంతరంగా ట్రోఫీ అందకుండానే టీమిండియా టోర్నీ నుంచి ఔట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్‌ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత 2009లో రెండో ఎడిషన్‌లో భారత్‌ సూపర్‌-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో భారత్.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ మూడు జట్లతో తలబడింది. అయితే ఈ మూడు జట్లపైనా టీమిండియా ఓడిపోయి.. చివరి స్థానంలో నిలవడమే కాకుండా.. అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2010 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ టోర్నీలో గ్రూప్ సీలో భాగంగా భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-8లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సూపర్-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో తలపడిన టీమిండియా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో టీమిండియా టోర్నీ నుంచి ఔట్ అయింది.

ఇది చదవండి: రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు

2012లో షాకిచ్చిన నెట్ రన్ రేట్..

2009, 2010 ప్రపంచకప్‌ల మాదిరిగానే 2012 ప్రపంచకప్‌లోనూ భారత్‌ మరోసారి సూపర్‌-8 రౌండ్‌ నుంచే ఎగ్జిట్ అయింది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్ సూపర్-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలబడిన భారత్.. పాక్, సఫారీలపై గెలిచి.. ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేట్ పరంగా పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉండటంతో భారత జట్టు సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించింది.

ఇది చదవండి: అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు.. కనిపెడితే ఖిలాడీవి నువ్వే

ఈసారి పెద్ద సవాలే..

ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గడిచిన టీ20 మ్యాచ్‌ల గణాంకాలు పరిశీలిస్తే.. ఈ మూడు జట్లపై భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ల ఫామ్‌.. టీమిండియాను భయపెడుతోంది. వీరిని ఓడించి భారత్‌ సెమీఫైనల్‌‌కు చేరాలంటే.. అంత ఈజీ ఏం కాదు. కాబట్టి ఈ రౌండ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబరచాల్సిందే.

గత టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ ప్రయాణం ఇలా..

  • 2007- ఛాంపియన్

  • 2009- సూపర్-8

  • 2010- సూపర్-8

  • 2012- సూపర్-8

  • 2014- రన్నరప్

  • 2016- సెమీఫైనల్

  • 2020- సూపర్-12

  • 2022- సెమీఫైనల్

ఇది చదవండి: పేరుకేమో సూపర్‌స్టార్.. ఒక్క పరుగు చేయలేదు.. ఒక్క వికెట్ తీయలేదు.. టీమిండియాకి పట్టిన శని అతడే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..