పేరుకేమో సూపర్‌స్టార్.. ఒక్క పరుగు కూడా చేయలేదు.. టీమిండియాకి పట్టిన శని అతడే

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్ స్టేజిలో ఒక్క మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించి.. గ్రూప్-ఏ నుంచి అగ్రస్థానంలో సూపర్-8 దశకు చేరుకుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో టీమిండియా మూడింట విజయం సాధించగా.. ఒక మ్యాచ్ నో రిజల్ట్‌గా వచ్చింది. ఇదిలా ఉండగా..

పేరుకేమో సూపర్‌స్టార్.. ఒక్క పరుగు కూడా చేయలేదు.. టీమిండియాకి పట్టిన శని అతడే
Team India
Follow us

|

Updated on: Jun 18, 2024 | 10:15 AM

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్ స్టేజిలో ఒక్క మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించి.. గ్రూప్-ఏ నుంచి అగ్రస్థానంలో సూపర్-8 దశకు చేరుకుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో టీమిండియా మూడింట విజయం సాధించగా.. ఒక మ్యాచ్ నో రిజల్ట్‌గా వచ్చింది. ఇదిలా ఉండగా.. సూపర్-8 మ్యాచ్‌లు ఆడే ముందు టీమిండియాకు ఓ ఇద్దరు ప్లేయర్స్.. ఇంకా చెప్పాలంటే.. ధోని శిష్యుడి ఫామ్ పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ ఇద్దరు ప్లేయర్స్‌లో ఒకరు విరాట్ కోహ్లీ కాగా.. మరొకరు రవీంద్ర జడేజా. విరాట్ కోహ్లీ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్‌లకే పెవిలియన్ చేరడం.. అటు టీం మేనేజ్‌మెంట్‌ను.. ఇటు ఫ్యాన్స్‌ను కంగారుపెట్టిస్తోంది. అయితే కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి తిరిగి రావడానికి.. ఒక్క మ్యాచ్ చాలు.. కాబట్టి.. చింత ఎందుకు దండగా అంటూ కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ బేఫికర్‌గా ఉన్నారు.

ఇక రవీంద్ర జడేజా విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడైన ఈ ప్లేయర్.. ధోని సారధ్యంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. వన్డేలు, టీ20లు, టెస్టుల్లో అనేక వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు వచ్చేసరికి హీరో నుంచి జీరోగా మారిపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ రన్స్ జీరో, వికెట్లు జీరో.. క్యాచ్‌లు జీరో.. ఇలా ప్రతీ విభాగంలో తన మార్క్ చూపించలేకపోతున్నాడు. కాగా, వీరిద్దరి ఫాంలేమి టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. సూపర్-8 మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా తిరిగి ఫాంలోకి వస్తే.. నెక్స్ట్ మ్యాచ్‌లలో వీరే జట్టుకు కీలకంగా మారనున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..