AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మొదట గోల్డెన్ డక్.. ఆ తర్వాత 27 బంతుల్లో సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డ్‌కే చెమటలు పట్టించిన ప్లేయర్

Saurav Chauhan 27 Balls Century: టీ20 ప్రపంచ కప్ 2024 కారణంగా, ఈ సమయంలో క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠ మ్యాచ్‌లను చూస్తున్నారు. వెస్టిండీస్‌, అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో టీ20 క్రికెట్‌లో ఎలాంటి తుఫాన్ ఇన్నింగ్స్‌లు చూడలేదు. ప్రపంచకప్‌లో తుఫాన్ బ్యాటింగ్‌ కనిపిస్తుందని అంతా భావించారు. కానీ, ఇంతవరకు అది జరగలేదు. ప్రపంచకప్‌తో పాటు, పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఓచోట మాత్రం కనిపించింది. ఒకే రోజు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడి ఫాస్టెస్ట్ సెంచరీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన సౌరవ్ చౌహాన్ అనే బ్యాట్స్‌మెన్ ఈ ఘనతను సాధించాడు.

Video: మొదట గోల్డెన్ డక్.. ఆ తర్వాత 27 బంతుల్లో సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డ్‌కే చెమటలు పట్టించిన ప్లేయర్
Sahil Chauhan
Venkata Chari
|

Updated on: Jun 17, 2024 | 9:03 PM

Share

Saurav Chauhan 27 Balls Century: టీ20 ప్రపంచ కప్ 2024 కారణంగా, ఈ సమయంలో క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠ మ్యాచ్‌లను చూస్తున్నారు. వెస్టిండీస్‌, అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో టీ20 క్రికెట్‌లో ఎలాంటి తుఫాన్ ఇన్నింగ్స్‌లు చూడలేదు. ప్రపంచకప్‌లో తుఫాన్ బ్యాటింగ్‌ కనిపిస్తుందని అంతా భావించారు. కానీ, ఇంతవరకు అది జరగలేదు. ప్రపంచకప్‌తో పాటు, పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఓచోట మాత్రం కనిపించింది. ఒకే రోజు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడి ఫాస్టెస్ట్ సెంచరీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన సౌరవ్ చౌహాన్ అనే బ్యాట్స్‌మెన్ ఈ ఘనతను సాధించాడు.

సైప్రస్, ఎస్టోనియా మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న ఎపిస్కోపీలో ఈ అద్భుతం కనిపించింది. సోమవారం, జూన్ 17, ఈ రెండు జట్ల మధ్య 6 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి, రెండవ మ్యాచ్‌లు జరిగాయి. అవును, ఒకే రోజులో రెండు మ్యాచ్‌లు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్టోనియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో సంచలన బ్యాటింగ్‌ను చూపించి ప్రపంచ రికార్డు సృష్టించాడు ఓ ప్లేయర్.

మొదటి ‘గోల్డెన్ డక్’..

ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సైప్రస్ 195 పరుగులు చేయగా, ఎస్టోనియా 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ సౌరవ్ చౌహాన్ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. మొదటి బంతికే (గోల్డెన్ డక్) ఔటయ్యాడు. కొంత సమయం తర్వాత ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగ్గా ఈసారి సౌరవ్ ఒంటిచేత్తో విధ్వంసం సృష్టించాడు. ఈసారి కూడా తొలుత బ్యాటింగ్ చేసిన సైప్రస్ 191 పరుగులు చేసింది. ఎస్టోనియా కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సౌరవ్ ప్రవేశించాడు. ఆపై సిక్సర్లు మాత్రమే మైదానంలో కనిపించాయి.

రికార్డు సెంచరీతో పూనకాలు..

తొలుత 14 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన సౌరవ్ ఆ తర్వాత 27 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రిస్ గేల్ (30 బంతుల్లో) రికార్డు ధ్వంసమైంది. సౌరవ్ తన ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లో 18 సిక్స్‌లు, 6 ఫోర్లతో 144 పరుగులు చేశాడు. ఈ విధంగా, అతను T20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన హజ్రతుల్లా జజాయ్ (16) రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దీని ఆధారంగా ఎస్టోనియా కేవలం 13 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

32 ఏళ్ల సౌరవ్ పేలుడు బ్యాటింగ్‌కు ప్రసిద్ధి. అంతకుముందు మే నెలలోనే ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..