AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు

మీ డైలీ లైఫ్‌లో రైలు జర్నీ ఓ భాగమైందా.? రైలులో దూర ప్రాంతాలకు తరచూ వెళ్లి.. వస్తుంటారా.? అయితే మీకే ఈ వార్త. మీరెప్పుడైనా రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా.? అదేనండీ.. రైలు టికెట్‌పై ట్రైన్ నెంబర్‌ను సూచించే.. 5 అంకెలు. ఈ 5 అంకెలు.. మీరు ఎక్కే ట్రైన్ గురించి వివరాలను తెలియజేయడమే కాదు..

రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
Train Ticket
Ravi Kiran
|

Updated on: Jun 17, 2024 | 8:37 PM

Share

మీ డైలీ లైఫ్‌లో రైలు జర్నీ ఓ భాగమైందా.? రైలులో దూర ప్రాంతాలకు తరచూ వెళ్లి.. వస్తుంటారా.? అయితే మీకే ఈ వార్త. మీరెప్పుడైనా రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా.? అదేనండీ.. రైలు టికెట్‌పై ట్రైన్ నెంబర్‌ను సూచించే.. 5 అంకెలు. ఈ 5 అంకెలు.. మీరు ఎక్కే ట్రైన్ గురించి వివరాలను తెలియజేయడమే కాదు.. ఆ ట్రైన్ స్థితిగతిని.. అలాగే అది ఏ కేటగిరికి చెందినదో చెప్పేస్తుంది. ఈ 5 అంకెల్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి అంతే..! మీరు నమ్మలేకపోవచ్చు.. కానీ ఇది నిజం. ఈ అంకెలు 0 నుంచి 9 మధ్యలో ఉంటాయి. వాస్తవానికి 0తో ఈ నెంబర్ మొదలైతే.. ఆ రైలు స్పెషల్ కేటగిరికి చెందినది అని అర్ధం. వేసవి స్పెషల్, లేదా పండుగ స్పెషల్.. లేదా ఇతర స్పెషల్ కేటగిరికి చెందిన రైలు.

మొదటిగా 1 అంకెతో రైలు నెంబర్ మొదలైతే.. ఆ ట్రైన్ దూర ప్రాంతాలకు వెళ్లేది అని అర్ధం. రాజధాని, జన్ శతాబ్ది, జన్ సాధర్, సంపర్క్‌క్రాంతి, గరీబ్‌రథ్, దురంతో లాంటి ట్రైన్స్ ఈ కేటగిరి కిందకు వస్తాయి. అలాగే మొదట 2 అంకెతో ట్రైన్ నెంబర్ మొదలైతే.. ఇది కూడా అత్యంత దూరం వెళ్లే రైలు అని అర్ధం. ఇక నెంబర్ 3 అంకెతో మొదలైతే.. ఈ రైలు కోల్‌కతా సబ్ అర్బన్ రైలు అని అర్థం. 4 అంకెతో మొదలైతే.. న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, అలాగే ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైళ్లు ఈ కేటగిరి కిందకు వస్తాయి.

5 అంకెతో మొదలైతే అది పాసింజర్ ట్రైన్ అని అర్ధం. అంకె 6తో రైలు నెంబర్ మొదలైతే అది మెము ట్రైన్. ఇక 7 అంకెతో మొదలైతే అది డెము రైలు. 8 అంకెతో మొదలయ్యే రైలు నెంబర్.. రిజర్వ్ చేసిన రైలుకు సూచిస్తుంది. 9 అంకెతో నెంబర్ స్టార్ట్ అయితే అది ముంబై సబ్ అర్బన్ రైలు. కాగా, ఈ ఐదు అంకెల్లో మొదటి అంకె రైలును సూచిస్తే.. మిగతా నాలుగు అంకెలు ఆ ట్రైన్ రైల్వే డివిజన్, జోన్‌ను సూచికను గుర్తిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్