Car Care Tips: మీ కారు మైలేజీ తగ్గిపోయిందా.. కారణమిదేనేమో? ఈ టిప్స్ ట్రై చేయండి..

కారు వినియోగం అనేది నేడు సర్వ సాధారణంగా మారింది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు అవసరాలు, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరడం కోసం ప్రతి ఒక్కరూ కారును వాడుతున్నారు. అయితే మైలేజీ బాగా వచ్చినప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి..

Car Care Tips: మీ కారు మైలేజీ తగ్గిపోయిందా.. కారణమిదేనేమో? ఈ టిప్స్ ట్రై చేయండి..
Car Mileage
Follow us

|

Updated on: Jun 17, 2024 | 6:35 PM

కారు వినియోగం అనేది నేడు సర్వ సాధారణంగా మారింది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు అవసరాలు, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరడం కోసం ప్రతి ఒక్కరూ కారును వాడుతున్నారు. అయితే మైలేజీ బాగా వచ్చినప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. మహేష్ యాదవ్ అనే వ్యక్తి తన చేవ్రొలెట్ డీజిల్ కారులో సుమారు ఒక లక్ష కిలోమీటర్లు ప్రయాణించారు. తన వ్యక్తిగత అనుభవం ఆధారంగా మైలేజీ పెరగడానికి అనేక చిట్కాలు తెలిపారు. ఆయన కారు అఫీషియల్ మైలేజీ 25.4 కాగా.. ఆయన పాటిస్తున్న చిట్కాల వల్ల ఎప్పుడూ 23.5 నుంచి 27 కిలోమీటర్ల వరకూ వస్తుందని వివరించారు.

టైర్ ఒత్తిడి..

మెరుగైన మైలేజీ కోసం టైర్లలో పూర్తిగా గాలిని నింపకూడదు. వాటిని దిగువన కొంచెం స్క్విష్, ఫ్లాట్ కాంటాక్ట్ ప్యాచ్‌ను సృష్టిస్తారు. టైర్ లో ఎక్కువ గాలిని నింపితే ఈ కాంటాక్ట్ ప్యాచ్ తగ్గిపోతుంది. గాలిని తక్కువగా నింపితే పెరుగుతుంది. కాబట్టి సమానంగా ఉండేలా చూసుకోవాలి. కారు ముందు ఇంజిన్ ఉండడంతో ముందు టైర్లపై ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. వెనుక టైర్లలో 35 పీఎస్ఎల్, ముందు టైర్లలో 40 చొప్పున మెయింటెన్స్ చేయాలి.

అమరిక..

నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల కిలోమీటర్లకు మీ కారు అలైన్‌మెంట్‌ను సరిచేయాలి. ప్రతి 10 వేల కిలోమీటర్లకూ అలైన్‌మెంట్, టైర్ బ్యాలెన్సింగ్, రొటేషన్ పూర్తి చేయాలి. అయితే మృదువైన రోడ్లపై డ్రైవ్ చేస్తుంటే ఈ వ్యవధిని పెంచుకోవచ్చు. కానీ గుంతలు, గతుకుల రోడ్లపై వెళుతుంటే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.

టైర్ల ఎంపిక..

కార్ల మైలేజీ సక్రమంగా రావాలంటే టైర్ల ఎంపిక బాగుండాలి. టైర్ పరిమాణం కూడా సక్రమంగా ఉండాలి. మృదువైన కాంపౌండ్ టైర్లు ఎంతో అనుకూలంగా ఉంటాయి. మెరుగైన గ్రిప్‌ను పొందడానికి అధిక స్పీడ్ రేటింగ్‌తో టైర్లను కొనుగోలు చేయాలి.

గేర్ మార్పులు..

మీరు ప్రతి గేర్‌లో ఎరుపు గీతను తాకే వరకు పెడల్‌ను ఫ్లోరింగ్ చేస్తుంటే ఇంధన సామర్థ్యం దెబ్బతింటుంది. కానీ మీరు 2000 ఆర్పీఎం వద్ద అప్‌షిఫ్ట్ చేసి, పెడల్‌ను అన్ని విధాలుగా పుష్ చేయడం మంచింది. మంచి మైలేజీని పొందడానికి ఇది మంచి మార్గం.

డిఫెన్సివ్ డ్రైవింగ్..

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాహనాల వేగాన్ని గమనించాలి. దానికి అనుగుణంగా వేగాన్నిపెంచడం లేదా లేన్లను మార్చడం చేసుకోవాలి. అవసరాన్నిబట్టి వేగాన్ని తగ్గించడం, కావాలనుకున్నప్పుడు పెంచడం చేయాలి. దాని వల్ల అస్తమానూ బ్రేక్ వేసే అవసరం తగ్గి, ఇంధనం ఆదా అవుతుంది.

గేర్‌లో కోస్టింగ్..

మీరు గేర్‌లో వెళ్లాలా వద్దా అనేది ట్రాఫిక్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 60 మీటర్లు, అంతకంటే ఎక్కువ దూరంలో రెడ్ సిగ్నల్ ఉందనుకోండి. యాక్సిలరేటర్, క్లచ్ పెడల్ ను తొక్కకుండా అక్కడకు కారు చేరుకునే అవకాశం ఉంటే మీరు వెంటనే గేర్ ను న్యూట్రల్ లోకి మార్చండి. దీనినే గేర్ లో కోస్టింగ్ అంటారు. ఈ సమయంలో ఇంధనం వినియోగించబడదు. అయితే ముందు, వెనుక వస్తున్న ట్రాఫిక్ ను చూసి నిర్ణయం తీసుకోవాలి.

ఇంజిన్ల సామర్థ్యం..

చిన్న ప్రయాణాల కోసం, చిన్న డిస్‌ప్లేస్‌మెంట్ ఇంజిన్‌ కారు ఉపయోగంగా ఉంటుంది. స్లో, స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడానికి వీలుగా ఉంటాయి. చిన్న ఇంజిన్లు తక్కువ వేగంతో మరింత సమర్థంగా పనిచేస్తాయి. కానీ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలపై అధిక వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే పెద్ద ఇంజిన్ వాహనాన్ని ఉపయోగించాలి.

ఇంజిన్ హీట్..

పెట్రోల్ ఇంజిన్లకు తమ ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలను పొందేందుకు 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. డీజిల్ ఇంజిన్లు కోల్డ్ స్టార్ట్ నుంచి అక్కడికి చేరుకోవడానికి 15 నుంచి 20 నిమిషాలు అవసరం. కాబట్టి ఇంజిన్ ను అస్తమానను కాకుండా ఒక్కసారే హీటెక్కేలా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ప్రతిసారీ ఇంధనం ఖర్చవుతుంది.

మంచి మైలేజీ కోసం..

ఆయిల్, ఫిల్టర్లను ప్రతి 10 వేల కిలోమీటర్లకు మార్చాలని యజమాని మాన్యువల్ చెబితే, ప్రతి 8 వేలు లేదా 9 వేల కిలోమీటర్లకు మార్చడానికి వెనుకాడవద్దు. దీని వల్ల ఇంజిన్‌ సమర్థంగా పనిచేసి, మంచి మైలేజీ అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ 4 వ్యాధులు గ్యారెంటీ..
ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ 4 వ్యాధులు గ్యారెంటీ..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి