ATM Services: ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసే వారికి బ్యాడ్ న్యూస్.. సర్వీస్ చార్జ్ పేరిట కొత్త బాదుడు..

ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజును రూ. 23కు పెంచాలని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ(సీఏటీఎంఐ) కోరింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కు విన్నవించింది. ఇది ఏటీఎం ఆపరేషనల్ చార్జీల కింద వసూలు చేయనుంది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఏటీఎం సర్వీసులు ప్రభావవంతంగా పనిచేసేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు.

ATM Services: ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసే వారికి బ్యాడ్ న్యూస్.. సర్వీస్ చార్జ్ పేరిట కొత్త బాదుడు..
Atm Card
Follow us
Madhu

|

Updated on: Jun 17, 2024 | 2:22 PM

ఏటీఎం సర్వీస్ చార్జీలు పెరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కస్టమర్ల నుంచి వసూలు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని ఏటీఎం సర్వీస్ ప్రోవైడర్లు ప్రతిపాదనలు పెట్టాయి. ఏటీఎం బిజినెస్ ను మరింత విస్తరించడానికి ప్రస్తుతం ఉన్న రేట్లను పెంచాలని వారు చూస్తున్నారు. ఇది జరిగితే ఉచిత లావాదేవీలు ముగిసిన చేసే ప్రతి లావాదేవీకి వినియోగదారులకు అదనపు ఫీజులు పడతాయి.

ఇంటర్ చేంజ్ ఫీజు అంటే..

ఇంటర్ చేంజ్ ఫీజు అంటే ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్ కి బ్యాంకు చెల్లించే రుసుము. ఇది వినియోగదారులు తమ కార్డుతో ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు ఇది పడుతుంది. ముఖ్యంగా ఒక బ్యాంకు కార్డుతో మరో బ్యాంకు ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు ఇది వినియోగదారుడికి పడుతుంది.

ఫీజు ఎంత పెంచనున్నారంటే..

ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజును రూ. 23కు పెంచాలని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ(సీఏటీఎంఐ) కోరింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కు విన్నవించింది. ఇది ఏటీఎం ఆపరేషనల్ చార్జీల కింద వసూలు చేయనుంది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఏటీఎం సర్వీసులు ప్రభావవంతంగా పనిచేసేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు రూ. 15 ఉండగా.. దానిని 2021లో రూ. 17కి పెంచారు. గరిష్ట లిమిట్ రూ. 21గా నిర్ణయించారు.

ప్రస్తుత ఏటీఎం లావాదేవీల లిమిట్స్ ఇవి..

ప్రస్తుతం సేవింగ్స్ ఖాతా దారులు దేశంలో ఆరు మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ప్రతి నెల ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఈ ఐదు ఉచిత లావాదేవీలు దాటితే అదనపు చార్జీలు వసూలు చేస్తారు. కాగా ఇప్పుడు ఏటీఎం చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై ఆర్బీఐ సానుకూలంగా స్పందించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వినియోగదారులపై ప్రభావం ఇది..

ఒకవేళ ఈ ప్రతిపాదనను ఆర్బీఐ అంగీకరిస్తే.. వినియోగదారులపై ఉచిత లావాదేవీల లిమిట్ దాటిన తర్వాత అదనపు చార్జీలు పడతాయి. తరచూ ఏటీఎంలలో నగదు ఉపసంహరించుకునే వారికి ఇది అదనపు భారం కాగలదు. కాగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఏటీఎంల వినియోగం బాగా తగ్గింది. అందరూ సెల్ ఫోన్లతోనే యూపీఐ లావాదేవీలు చేసేస్తున్నారు. చేతిలో డబ్బులు ఉంచుకోవాలనే ఆలోచనే జనాల్లో తగ్గిపోయింది.  ఈ క్రమంలో ఇప్పుడు ఈ నిర్ణయం కూడా ఏటీఎంల వినియోగంపై పెద్ద ప్రభావమే చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..