Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్‌ ఉందా? వెంటనే ఈ పని చేయండి.. లేకుంటే ఖాతా క్లోజ్‌

బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికి అకౌంట్‌ ఉంటుంది. ఈ రోజుల్లో జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్‌ తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. బ్యాంకులు. అయితే బ్యాంకులు ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తున్నాయి. రూల్స్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఖాతా తీసుకుని ఎలాంటి లావాదేవీలు జరుపరు. అలాంటి ఖాతాలను బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి..

Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్‌ ఉందా? వెంటనే ఈ పని చేయండి.. లేకుంటే ఖాతా క్లోజ్‌
Bank Account
Follow us

|

Updated on: Jun 17, 2024 | 12:47 PM

మీకు ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పొదుపు ఖాతా ఉందా? అప్పుడు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలలో ఇది ఒకటి. మీకు గత 3 సంవత్సరాలుగా లావాదేవీలు జరగని ఖాతాలు ఉన్నట్లయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంకును సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ నెలలోనే విధివిధానాలు పూర్తి చేయాలని నిర్ణయించింది బ్యాంకు.

గత మూడు సంవత్సరాలుగా ఖాతా బ్యాలెన్స్ ఎలాంటి లావాదేవీలు జరుపకుండా జీరో బ్యాలెన్స్‌ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అలాంటి ఖాతాదారులకు బ్యాంకు స్వయంగా నోటీసులు పంపింది. మీరు ఖాతాలను మళ్లీ ఉపయోగించాలనుకుంటే, మీ బ్యాంక్ శాఖకు వెళ్లి KYCని పూర్తి చేయండి. చాలా మంది మోసగాళ్లు ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారనే సమాచారం మేరకు బ్యాంకు ఈ చర్య తీసుకుంది. 3 సంవత్సరాల పాటు నిష్క్రియంగా ఉన్న అన్ని ఖాతాలు మూసివేస్తోంది బ్యాంకు. అయితే ఖాతాను కేవైసీ చేసుకునేందుకు గుర్తింపు రుజువు తప్పనిసరి అవి పాన్‌కార్డు, ఆధార్‌, పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవంటివి అవసరం. అలాగే చిరునామా రుజువు కూడా అవసరం. ఆధార్‌, విద్యుత్‌ బిల్లు, నీటి బిల్లు, ఇంటి పన్ను రశీదు వంటివి చిరునామా రుజువుగా ఉపయోగించుకోవచ్చు. ఒక అయితే ఈ ఖాతాలకు కేవైసీ చేసుకునేందుకు జూన్‌ 1 వరకు మాత్రమే గడువుగా తీసుకుంది బ్యాంకు. మీ అకౌంట్‌ కేవైసీ చేయనట్లయితే ఈ పత్రాలను అందించి మళ్లీ అకౌంట్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఖాతాలను బ్యాంకు మూసివేయదు. అలాంటి ఖాతాలు ఏమిటో చూద్దాం.

మూసివేయని ఖాతాలో ఏమిటంటే..

ఇవి కూడా చదవండి

కొన్ని ఖాతాలకు ఈ రకమైన తగ్గింపు ఉంది. మొదటిది డీమ్యాట్ ఖాతాలు. డీమ్యాట్ ఖాతాలకు ఈ నిబంధన వర్తించదు. అలాగే ఈ బ్యాంకులో సుకన్య సమృద్ధి యోజన (SSY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ వంటి పథకాల కోసం తెరిచిన ఖాతాలను మూసివేయదు. ఇందులో పెన్షన్ యోజన, మైనర్ సేవింగ్స్ ఖాతా కూడా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి