AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. మంగళవారం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే

ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. 80 వేలు దాటేసి లక్షకు పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి. దీంతో బంగారం అనగానే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం పెళ్లిల్లు లాంటి శుభకార్యాలు లేకపోవడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు శాంతిస్తున్నాయి. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో...

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. మంగళవారం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే
Gold Price Latest
Narender Vaitla
|

Updated on: Jun 18, 2024 | 6:32 AM

Share

ఏదైనా శుభకార్యం అనగానే ఠక్కున గుర్తొచ్చేది బంగారం. కేవలం అలంకరణ ఆభరణమే కాకుండా, పెట్టుబడికి కూడా బంగారాన్ని ఒక మార్గంగా ఎంచుకోవడం ఎప్పటి నుంచో ఇక ఆనవాయితీగా వస్తోంది. అందుకే బంగారం ధరలకు సంబంధించి ప్రజల్లో నిత్యం ఒక ఆసక్తినెలకొని ఉంటుంది. అందుకే ప్రతీ రోజు బంగారం ధరలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని కోరుకుంటారు. ఇక గత కొన్ని రోజుల క్రితం నుంచి ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది.

ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. 80 వేలు దాటేసి లక్షకు పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి. దీంతో బంగారం అనగానే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం పెళ్లిల్లు లాంటి శుభకార్యాలు లేకపోవడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు శాంతిస్తున్నాయి. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,470 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,290కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,320 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,890గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ఊ. 72,970 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 66,290గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,320గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,290గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,320 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,290గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 72,320గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,290వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,320గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 90,000 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 95,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..