Balkampet: జూలై 9న బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం.. ప్రత్యేక ఏర్పాట్లపై అధికారుల దృష్టి
హిందువుల పండగలు మొదలయ్యే తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, చాతుర్మాస్ వ్రతంలతో పాటు తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన బోనాలు పండుగ ఆషాడ మాసంలోనే జరుపుకుంటారు. అంతేకాదు భాగ్యనగర వాసులకు కొంగు బంగారంగా ప్రసిద్దిగాంచిన బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవం కూడా ఆషాడ మాసంలోనే అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. హిందూ తెలుగు చాంద్రమానం ప్రకారం బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణం ఆషాడ మాసం మొదటి మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది అమ్మవారి కళ్యాణం ఎప్పుడు జరగనుందో తెలుసుకుందాం..
హిందూ తెలుగు క్యాలెండర్ లో నాల్గవ మాసం ఆషాడ మాసం. ఈ ఏడాది ఆషాడ మాసం 2024 జూలై 6 మొదలై.. ఆగస్ట్ 4 వరకు ఉంటుంది. పండగలకు, పర్వదినాలకు జరుపుకునే ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తారు. హిందువుల పండగలు మొదలయ్యే తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, చాతుర్మాస్ వ్రతంలతో పాటు తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన బోనాలు పండుగ ఆషాడ మాసంలోనే జరుపుకుంటారు. అంతేకాదు భాగ్యనగర వాసులకు కొంగు బంగారంగా ప్రసిద్దిగాంచిన బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవం కూడా ఆషాడ మాసంలోనే అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. హిందూ తెలుగు చాంద్రమానం ప్రకారం బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణం ఆషాడ మాసం మొదటి మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది అమ్మవారి కళ్యాణం ఎప్పుడు జరగనుందో తెలుసుకుందాం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగ. బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం. ఈ ఏడాది అమ్మవారి కల్యాణాన్ని 2024 తేదీ జూలై 9న నిర్వహించనున్నారు. మర్నాడు అంటే 2024 తేదీ జూలై 10న రథోత్సవాన్ని జరపనున్నారు. పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్దిగాంచిన ఎల్లమ్మ దేవిని రేణుకా దేవి, జల దుర్గా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అమ్మవారి విగ్రహం దాదాపు 10 అడుగులు భూమి క్రింద నీటితో చుట్టుముట్టబడిన శయన స్థితిలో ఉంటుంది.
ఎల్లమ్మ తల్లి కళ్యాణం శక్తి మాతను మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. ఈ కళ్యాణం చూసి తీర్ధప్రసాదాలు స్వీకరించిన భక్తుల కోరిన కోర్కెలు తీర్చడంతోపాటు పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్మకం. అందుకంటే అమ్మవారి వార్షిక ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి అమ్మవారికి పట్టు వస్త్రాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది. కల్యాణం జరిగిన మర్నాడు వార్షిక రథోత్సవం జరుగుతుంది.
ఉత్సవాల్లో భాగంగా భక్తులు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రధానంగా అమ్మవారికి చీరలు, గాజులతో పాటు ఇతర సౌందర్య ఉత్పత్తులను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారు. కొంతమంది భక్తులు వేప ఆకులతో అలంకరించిన పాల కుండలను తీసుకువెళతారు. ఉత్సవాల్లో పసుపును విరివిగా ఉపయోగిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..