Budh Pradosh Vratam: జాతకంలో బుధదోషమా రేపు ఈ వస్తువులను దానం చేయండి.. శివపార్వతుల ఆశీస్సులు కురుస్తాయి

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష త్రయోదశి తిథి జూన్ 19 ఉదయం 07:28 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూన్ 20 ఉదయం 07:49 గంటలకు ముగుస్తుంది. ప్రదోష వ్రతం సమయంలో సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు .. సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాలు పూజకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. బుధ ప్రదోష రోజున శివపార్వతులతో పాటు విఘ్నాలకధిపతి గణపతిని పూజిస్తారు. అలాగే ప్రదోష వ్రతం గణపతి అనుగ్రహం కోసం ఆచరిస్తారు. బుధ ప్రదోష వ్రతం ఆచరించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే వ్యాపారం, ఉపాధిలో విభిన్న మార్గాలు దొరుకుతాయి.

Budh Pradosh Vratam: జాతకంలో బుధదోషమా రేపు ఈ వస్తువులను దానం చేయండి.. శివపార్వతుల ఆశీస్సులు కురుస్తాయి
Budh Pradosh Vratam
Follow us

|

Updated on: Jun 18, 2024 | 3:25 PM

హిందూ మతంలో ప్రదోష వ్రతం ప్రతి సంవత్సరం కృష్ణ పక్షం.. ప్రతి నెల శుక్ల పక్షం త్రయోదశి రోజున వస్తుంది. ఈ త్రయోదశి తిధిలో శివ పార్వతులను ఆరాధిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసానికి మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రదోష వ్రతం రోజున దానం చేయడం వలన శివ పార్వతులు సంతోషించి తమ భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం. ఈసారి ప్రదోష వ్రతం జూన్ 19వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ఈ వ్రతం బుధవారం రోజున వచ్చింది కనుక దీనిని బుధ ప్రదోష వ్రతంగా పరిగణిస్తారు.

పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష త్రయోదశి తిథి జూన్ 19 ఉదయం 07:28 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూన్ 20 ఉదయం 07:49 గంటలకు ముగుస్తుంది. ప్రదోష వ్రతం సమయంలో సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు .. సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాలు పూజకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది.

బుధ ప్రదోష రోజున శివపార్వతులతో పాటు విఘ్నాలకధిపతి గణపతిని పూజిస్తారు. అలాగే ప్రదోష వ్రతం గణపతి అనుగ్రహం కోసం ఆచరిస్తారు. బుధ ప్రదోష వ్రతం ఆచరించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే వ్యాపారం, ఉపాధిలో విభిన్న మార్గాలు దొరుకుతాయి.

ఇవి కూడా చదవండి

వేటిని దానం చేయడం శుభప్రదం అంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో బుధ దోషం ఉంటే వారు బుధ ప్రదోష వ్రతాన్ని చేయడం వలన జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది. అలాగే గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ప్రదోష వ్రతం రోజున ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే నిబంధన కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఈ చర్యలను అనుసరించడం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులతో సహా అన్ని రకాల దుఃఖాల నుంచి ఉపశమనం పొందాలనుకుంటే నిరుపేదలకు కొన్ని వస్తువులను దానం చేయండి.

  1. నల్ల నువ్వులు శివునికి చాలా ప్రీతికరమైనవి. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.
  2. పెరుగు చల్లగా, పోషకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు పెరుగు దానం చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
  3. నెయ్యి దేవతల ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల బుద్ధికి పదును, జ్ఞానం పెరుగుతుంది.
  4. కొబ్బరిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రోజు కొబ్బరికాయను దానం చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
  5. అవసరమైన వారికి బట్టలు దానం చేయడం ఉత్తమ మార్గాలలో ఒకటి. ఈ రోజున వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. పాపాలు నశిస్తాయి.
  6. అన్నదానం: అవసరం లేనివారికి అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయి.
  7. బుధ ప్రదోష వ్రతం రోజున దానం చేయడం వల్ల శివపార్వతిల అనుగ్రహం పొంది జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.

ప్రదోష వ్రతం ప్రాముఖ్యత

ప్రదోష వ్రతం రోజున శివుడిని ఆరాధించడం ద్వారా ఆశీర్వాదం లభించి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున శివుడిని ఆరాధించి కోరిన కోరికలు తీరతాయని.. ఆయన అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ప్రదోష ఉపవాసం గ్రహ దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల గ్రహాల అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతోషం, శ్రేయస్సు పొందేందుకు ప్రదోష వ్రతం ఉత్తమ మార్గం. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

Latest Articles