Hyderabad: సామాన్యుడి ప్లేట్‌లో మటన్ ముక్కకు ముంచుకొస్తున్న గండం.. కార్తీక మాసం తర్వాత..

మాంసాహార ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. కేవలం ఏడాది వ్యవధిలోనే మటన్ రేట్లు డబుల్ అయ్యాయి. ఇక రానున్న రోజుల్లో సామాన్యుడు మటన్ కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుందని.. మార్కెట్ వర్గాలు, వినియోగదారులు పేర్కొంటున్నారు.

Hyderabad: సామాన్యుడి ప్లేట్‌లో మటన్ ముక్కకు ముంచుకొస్తున్న గండం.. కార్తీక మాసం తర్వాత..
Mutton Prices In Hyderabad
Follow us

|

Updated on: Nov 02, 2022 | 8:54 PM

మాంసాహార ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. కేవలం ఏడాది వ్యవధిలోనే మటన్ రేట్లు డబుల్ అయ్యాయి. ఇక రానున్న రోజుల్లో సామాన్యుడు మటన్ కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుందని.. మార్కెట్ వర్గాలు, వినియోగదారులు పేర్కొంటున్నారు. గతేడాది 500 నుంచి 550 ఉన్న కిలో మటన్ ధర.. ప్రస్తుతం రూ.800 నుంచి రూ.850 గా కొనసాగుతోంది. రానున్న రోజుల్లో మటన్‌ ధరలు మంట రేపడం ఖాయమని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో కిలో మేక మాంసం ధర మరోసారి అక్షరాల వెయ్యి దాటడం ఖాయమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నాణ్యతకు అనుగుణంగా కిలో మటన్‌ ధర రూ.800 నుంచి 900 రూపాయలకు వరకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మటన్‌ ఇప్పటికే కొన్నిచోట్ల నాలుగు అంకెల స్థాయికి చేరిందని పేర్కొంటున్నారు.

గొర్రెలు, మేకల కొరతతో పాటు వివిధ కారణాలతో హైదరాబాద్ వాసులు మటన్ ధరలను చూడబోతున్నారని.. మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మటన్‌ ధరలు ఆల్‌టైమ్ రూ.వేయికి చేరుకునే అవకాశం దగ్గర్లోనే ఉందని అంచనా వేస్తున్నారు. నవంబర్ 23న తెలుగు కార్తీక మాసం ముగిసిన తర్వాత ధరలు రూ.1000 మార్కును కూడా అధిగమించవచ్చంటున్నారు. ఏడాది వ్యవధిలో హైదరాబాద్‌లో మటన్ ధరలు రెట్టింపు కానుండగా, గతేడాది కంటే రూ. కిలో రూ.500 – 550 వరకే ఉందని వినియోగదారులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో మటన్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

నగరంలో మటన్ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పశువులు, మేకలు, గొర్రెల కొరతగా పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం, పంపిణీ పథకానికి ప్రాచుర్యం కల్పించి సరఫరాను పెంచాలని ప్రయత్నిస్తున్నా.. చాలా మంది దీనిపై ఆసక్తి చూపకపోవడంతో ఆశించిన ఫలితం దక్కడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. సరఫరా-డిమాండ్ సరిపోలకపోవడంతో పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణకు గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. జంతువులను రవాణా చేయడం వల్ల రవాణా ఖర్చులు పెరగడంతో హైదరాబాద్‌లో మటన్ ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

సరఫరా పరంగా అడ్డంకులు కాకుండా, డిమాండ్ పెరగడం కూడా నగరంలో మటన్ ధరల పెరుగుదలకు కారణమని పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌ నగరంలో మాంసం వినియోగం భారీగా పెరిగింది. కరోనా మహమ్మారి నాటినుంచి ప్రజలు ఆరోగ్యకరమైన పోషక ఆహారం తినేందుకు ఇష్టపడుతుండటం కూడా ఒక కారణమని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..