Watach Video: వార్నీ ఇదెక్కడి యవ్వారం.. ఆ జిల్లా సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో విచిత్ర ఘటన..
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నకల్లో గెలుపుకోసం నేతలు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవలే ఎన్నికల్లో ఓడించేందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నానే ఘటన వెలుగు చూడగా తాజాగా అలాంటి సీన్ మళ్లీ రిపీట్ అయింది. సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యం కావడంతో అతన్ని ఎవరో హత్య చేశారని సాగిన ప్రచారం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది.

మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యం చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన చేర్యాల సబిత సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఆమె గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. గ్రామస్తులు పోలీసులు వచ్చారంటూ చెప్పడంతో ఆమె భర్త జనార్దన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి పంట పొలాల్లో పడిపోయారు. దీంతో తలకు దెబ్బతాకి అపస్మాల్క స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే అతను కపించకపోయే సరికి.. అర్ధరాత్రి జనార్దన్ రెడ్డిని ఎవరో హత్య చేశారని,, కిడ్నాప్ చేశారంటూ వదంతులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న రామయంపేట సిఐ వెంకట్ రాజా గౌడ్, తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ గ్రామానికి చేరుకొని ప్రత్యేక బృందాలు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, పోలీస్ తో తనిఖీలు చేపట్టారు. అయినా ఎక్కడ అతని ఆచూకీ లభించలేదు. అయితే మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జనార్దన్ రెడ్డి పంట పొలాల నుండి బయటకు వచ్చాడు.
అయితే అతన్ని చూసిన జనాలు, పోలీసులు షాక్ అయ్యారు. రాత్రి నుంచి ఎటువెళ్లావ్ అని అతన్ని అడగగా తనకు గాయం కావడంతో అపస్మాత్తు స్థితికి వెళ్లానని.. ఇప్పుడే అపస్మారక స్థితి నుండి బయటకు వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో జనార్థన్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




