బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్.. అభినందించిన ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ప్రకటించింది. బీహార్ మంత్రి నితిన్ నబిన్ పార్టీ కొత్త తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన జెపి నడ్డా స్థానంలో పార్టీ కొత్త నాయకుడిగా నియమితులవుతారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నవీన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా అభినందించారు.

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ప్రకటించింది. బీహార్ మంత్రి నితిన్ నబిన్ పార్టీ కొత్త తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన జెపి నడ్డా స్థానంలో పార్టీ కొత్త నాయకుడిగా నియమితులవుతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన లేఖలో, “భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నియామకం వెంటనే అమలులోకి వస్తుంది” అని పేర్కొన్నారు.
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నవీన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా అభినందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ మోదీ.. “నితిన్ నవీన్ కష్టపడి పనిచేసే బీజేపీ కార్యకర్తగా తనను తాను నిరూపించుకున్నారు. ఆయన యువ, అంకితభావంతో పనిచేసే నాయకుడు, సంస్థాగత అనుభవం సంపద కలిగిన వ్యక్తి, బీహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పర్యాయాలు అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన పూర్తి విధేయత, అంకితభావంతో పనిచేశారు.” అని పేర్కొన్నారు.
“ఆయన వినయపూర్వకమైన స్వభావానికి, నిక్కచ్చిగా పనిచేసే తత్వానికి నిదర్శనం. రాబోయే సంవత్సరాల్లో ఆయన శక్తి, నిబద్ధత మన పార్టీని మరింత బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు” అని ప్రధాని అన్నారు.
Shri Nitin Nabin Ji has distinguished himself as a hardworking Karyakarta. He is a young and industrious leader with rich organisational experience and has an impressive record as MLA as well as Minister in Bihar for multiple terms. He has diligently worked to fulfil people’s…
— Narendra Modi (@narendramodi) December 14, 2025
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన బీహార్ కేబినెట్ మంత్రి నితిన్ నబిన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆయన, “బిహార్‌కు చెందిన యువ నాయకుడు నితిన్ నబిన్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైనందుకు హృదయపూర్వక అభినందనలు. ఆయన కష్టపడి పనిచేసే కార్యకర్త, గొప్ప ఊహాశక్తిగల వ్యక్తి” అని అన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో, ఆయన బీజేపీని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్లడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు.
बिहार की धरती से आने वाले युवा और ऊर्जावान नेता श्री @NitinNabin को @BJP4India के कार्यकारी अध्यक्ष नियुक्त किए जाने पर हार्दिक बधाई। वे एक कर्मठ कार्यकर्ता और कल्पना क्षमता के धनी व्यक्ति हैं।
प्रधानमंत्री श्री @narendramodi के प्रेरक नेतृत्व में वे भाजपा को सफलता की नई…
— Rajnath Singh (@rajnathsingh) December 14, 2025
బీహార్ రాష్ట్ర రోడ్డు నిర్మాణ మంత్రి నితిన్ నబిన్ ను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ అభినందనలు తెలిపారు. “బీహార్ నుండి ఒకరు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులవడం భారతీయ జనతా పార్టీకి చారిత్రాత్మకమైన రోజు. ఇది మాకు, బీహార్ ప్రజలు అందరికీ సంతోషకరమైన విషయం, బీహార్ బీజేపీ తరపున, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైనందుకు ఆయనను అభినందిస్తున్నాను” అని ఆయన అన్నారు.
#WATCH | Patna, Bihar | On Bihar Minister Nitin Nabin appointed as the National Working President of the BJP, Bihar BJP President and Bihar government minister Dilip Jaiswal says, "Today is a very historic day for the BJP that a leader from Bihar has been appointed as the… pic.twitter.com/KgY7UwkkoU
— ANI (@ANI) December 14, 2025
నితిన్ నబిన్ ఎవరు?
బీహార్ ప్రభుత్వంలో పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్న నితిన్ నవీన్ కాయస్థ వర్గానికి చెందిన వ్యక్తి. ఈసారి ఆయన బీహార్‌లోని బంకిపూర్ నియోజకవర్గం నుండి ఐదవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తన తండ్రి మరణం తర్వాత, ఆయన రాజకీయ వారసత్వాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఆయన 2010, 2015, 2020లలో, ఇప్పుడు మళ్ళీ 2025లో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 9, 2021న నితీష్ కుమార్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రోడ్డు నిర్మాణ మంత్రిగా అవకాశం పొందారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




