Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు మనోడే
Hardik Pandya :భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో మెరిసి ఒక అరుదైన చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 100 వికెట్లు పూర్తి చేయడమే కాకుండా, 100 సిక్సర్లు, 100 వికెట్లు తీసుకున్న అరుదైన ఘనత సాధించిన మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (13 బంతుల్లో 9 పరుగులు) వికెట్‌ను తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా ఈ మైలురాయిని చేరుకున్నాడు. స్టబ్స్ క్యాచ్‌ను వికెట్ కీపర్ జితేశ్ శర్మ అందుకున్నాడు. ఇది హార్దిక్‌కు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ వికెట్. ఈ ఘనత సాధించిన భారతీయులలో అతను మూడో స్థానంలో నిలిచాడు.
టీ20ఐ క్రికెట్ చరిత్రలో 100 సిక్సర్లు, 100 వికెట్లు తీసుకున్న ప్రపంచంలోని నాలుగో ఆటగాడు హార్దిక్ పాండ్యా. మొహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్), సికందర్ రజా (జింబాబ్వే), వీరేన్‌దీప్ సింగ్ (మలేషియా) తర్వాత ఈ ఫీట్‌ను సాధించిన తొలి భారతీయుడు హార్దికే.
100 వికెట్లు, 100 సిక్సర్లతో పాటు, హార్దిక్ పాండ్యా 2000 పరుగులు పూర్తి చేయడానికి కూడా దగ్గరగా ఉన్నాడు. ప్రస్తుతం 1,939 పరుగులు చేసిన హార్దిక్, మరో 61 పరుగులు చేస్తే ఈ మార్కును చేరుకున్న ఐదో భారతీయ ఆటగాడు అవుతాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, బౌలర్లందరూ అద్భుతంగా రాణించడంతో సౌత్ ఆఫ్రికాపై పైచేయి సాధించింది. ఏడో ఓవర్‌లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన 100వ వికెట్‌ను ట్రిస్టన్ స్టబ్స్ (9 పరుగులు) రూపంలో తీసుకున్నాడు. 8 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.
తొలి 6 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. హర్షిత్ రాణా 4వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ (2 పరుగులు) వికెట్ తీసి సౌతాఫ్రికాకు మూడో దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో 17 బంతులు తర్వాతే సౌతాఫ్రికా తొలి బౌండరీని సాధించింది.