AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Water Supply : భాగ్యనగర వాసులు బహుపరాక్.. మీకు ఉచిత వాటర్ కావాలంటే ఆధార్ లింక్ చేయాల్సిందే..

శంలో అన్నింటికీ ఆధార్ ఆధారం అన్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి.. బ్యాంక్ లావాదేవీలు ఇలా అన్నింటికీ ఆధార్ లింక్ ఉండాల్సిందే.. అయితే తాజాగా తెలంగాణ సర్కార్ కూడా ఓ పథకానికి..

Free Water Supply : భాగ్యనగర వాసులు బహుపరాక్.. మీకు ఉచిత వాటర్ కావాలంటే ఆధార్ లింక్ చేయాల్సిందే..
Aadhaa Linkage
Surya Kala
|

Updated on: Mar 17, 2021 | 12:55 PM

Share

Free Water Supply : దేశంలో అన్నింటికీ ఆధార్ ఆధారం అన్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి.. బ్యాంక్ లావాదేవీలు ఇలా అన్నింటికీ ఆధార్ లింక్ ఉండాల్సిందే.. అయితే తాజాగా తెలంగాణ సర్కార్ కూడా ఓ పథకానికి ఆధార్ లింక్ తప్పని సరి అంటుంది. అవును ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటిని అందుకోవాలంటే అపార్ట్ మెంట్ లోని ప్రతి ఒక్క ప్లాట్ వినియోగదారుడు తప్పని సరిగా నల్లా కనెక్షన్ కు ఆధార ను లింక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

జీహెచ్ ఎం సి ఎన్నికల హామీలో భాగంగా భాగ్యనగర వాసులకు ప్రతి నెలా 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందుకోవాలంటే కుళాయి కనెక్షన్‌ నంబరుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి . అందుకోసం జలమండలి అధికారిక వెబ్‌సైట్ www.hyderabadwater.gov.in కు లాగిన్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 31 వ తేదీ చివరి తేదీ.

అయితే అపార్ట్ మెంట్ మొత్తానికి ఓకే కనెక్షన్ ఉంటుంది. అయితే ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ప్లాట్స్ మాత్రం అనేకం ఉంటాయి. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ లో నివసించే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా కుళాయి కనెక్షన్ నెంబర్ ను ఆధార్ కు లింక్ చేయాలని జలమండలి స్పష్టం చేసింది.

ఒక్క అపార్ట్మెంట్ వాసులే కాదు.. ఉచితంగా మంచి నీటి సదుపాయంకు అర్హులైన ప్రతి ఒక్కరూ అంటే మురికివాడలు మినహా ఇతర గృహ వినియోగదారులు కూడా కుళాయి నెంబర్ కు ఆధార్‌ను లింక్ చేసుకోవాలని.. ఇది మీ సేవ కేంద్రాల్లో చేస్తారని జలమండలి తెలిపింది, అంతేకాదు టాప్ మీటర్ పని తీరుని కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలని. మీటర్ సరిగ్గా పనిచేయకపోతే ఉచిత మంచి నీటి పథకానికి అటువంటి వినియోగదారుడు అనర్హుడని స్పష్టం చేసింది.

అపార్ట్‌మెంట్‌ వాసులు ఆన్ లైన్ ద్వారా అనుసంధానం చేసుకునే విధానం తెలుసుకుందాం :

www.hyderabadwater.gov.in కు లాగిన్ అవ్వాలి. అనంతరం ఆధార్‌ అనుసంధానం అన్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. కుళాయి కనెక్షన్ కు ఇచ్చిన (అపార్ట్మెంట్ )మొబైల్‌ నంబరుకు ఓటీపీ వెళుతుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తేనే ఎక్స్‌ఎల్‌ షీట్‌ ఓపెన్‌ అవుతుంది. అప్పుడు ఫ్లాట్‌ యజమాని పేరు, పీటీఐఎన్‌ నంబరు, అనంతరం ఆధార్‌ నెంబర్ ను నమోదు చేయాలి. వెంటనే ఆధార్‌ నంబరుకు లింక్‌ చేసిన మొబైల్‌ నంబరుకు మరో ఓటీపీ మెసేజ్‌వెళుతుంది. ఈ ఓటీపీ ని ఎంటర్ చేసిన వెంటనే టాప్ కలెక్షన్ కోసం ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది

గమనిక: అయితే ఆధార్ లింక్ చేసే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. 155313 కు కాల్ చేసి పూర్తి వివరాలను తీసుకోవచ్చని జలమండలి అధికారులు తెలిపారు.

Also Read: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. ఎన్నిమందులు వాడినా ఫలితం లేదా.. ఈ ఆసనం ట్రై చేసి చూడండి

దొంగచాటు యవ్వారం.. ప్రియురాలితో షికారు.. భార్యకు అడ్డంగా దొరికిన భర్త.. వైరల్ వీడియో!